గ్లాసు పాలతో రోజును మొదలుపెట్టే పెద్దలు, పిల్లలు ఎంతో మంది. అయితే పాలు వేడిగా తాగితే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చా? లేక గది ఉష్ణోగ్రత కలిగిన సాధారణ పాలను తాగితే మంచిదా? అన్న సందేహం మాత్రం ఎక్కువమందికి ఉంది. ఆరోగ్యనిపుణులు పాలు ఎలా తాగినా మంచిదే అని చెబుతున్నారు. అయితే వ్యక్తికి ఉన్న సమస్యలను బట్టి ఎంచుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.
వారికి చల్లని పాలు
ఛాతీలో మంట, నొప్పి కొందరికీ తరచూ వస్తుంటుంది. అలాంటివారు చల్లని పాలు తాగితే మంచిది. చల్లని పాలల్లో చిటికెడు సోంపు పొడి వేసుకుని సేవిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పాలల్లో ఉన్న డైటరీ ఫైబర్స్ జీర్ణక్రియను మెరుగుపరుచడానికి సహాయపడతాయి. అలాగే పాలల్లో బాదం పప్పులు, ఖర్జూరాల్లాంటివి మెత్తగా చేసి కలుపుకుని తాగినా చాలా మేలు. ఇలా తాగితే రక్తహీనత సమస్య రాదు. మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది. పాలల్లో ఉండే అమైనో ఆమ్లాలు జీవక్రియ రేటును వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా సాయపడుతుంది. బ్రేక్ ఫాస్ట్ సమయంలో చల్లటిపాలు తాగడం వల్ల ఆకలి వేయకుండా ఎక్కువ సేపు ఉండగలరు. అలాగే శరీరం కూడా డీహ్రైడ్రేట్ కాకుండా ఉంటుంది. కాబట్టి చల్లనిపాలు తాగినా మంచిదే.
వేడి పాలు వీరికి మంచిది
జలుబు, ఒళ్లొనొప్పులు, గొంతు నొప్పి నివారించడానికి వేడిపాలు చాలా మేలు చేస్తాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారికి వేడి పాలు మంచివి. రాత్రి పడుకోవడానికి గంట ముందు వేడి పాలను తాగాలి. గంట తరువాత మంచిగా నిద్ర పడుతుంది. అయితే అజీర్తి సమస్యలు ఉన్న వాళ్లు మాత్రం రాత్రి పూట పాలు తాగకపోవడం చాలా మంచిది. రాత్రి నిద్రపోయాక జీవక్రియ మందగిస్తుంది. ఇలాంటి సమయంలో పాలు అరగవు. దీనివల్ల ఉదయాన కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది.
మీకు పాలు వల్ల ఎలాంటి లాభాలు కావాలని కోరుకుంటున్నారో దాన్ని బట్టి వేడిపాలు తాగాలా లేక చల్లని పాలు తాగాలా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. ఉదయం చల్లని పాటు, సాయంత్రం దాటాక వేడి పాలు అయితే మేలు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: నిద్రసరిగా పట్టడం లేదా... ఆహారంలో ఉప్పు తగ్గించండి
Read Also: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్
Read Also: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి