నేచురల్ అందం, అదిరిపోయే అభినయంతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను కట్టిపడేసింది సాయిపల్లవి.  ఆమె అందమంతా రింగురింగుల జుట్టులోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పట్నించో సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా హీరోయిన్ గా రాబోతోందంటూ వార్తలు  వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజం అయ్యాయి. పూజా హీరోయిన్ గా చేసిన తొలిసినిమా విడుదల కాబోతోంది. డిసెంబర్ 3న ఆమె నటించిన తమిళ సినిమా ‘చిత్తిరై సేవానమ్’ జీ5 ఓటీటీలో విడుదల కానుంది. పూజా తన సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను స్వయంగా రివీల్ చేసింది. ‘ఎప్పట్నించో ఈ సినిమా కోసం ఎదురుచూస్తువన్నా. డిసెంబర్ 3న సినిమా విడుదల కానుంది. కొంచెం నెర్వస్ గా ఫీలవుతున్నా. సినిమాలో నా పాత్రని నేను ఎంత ఎంజాయ్ చేశానో, సినిమా చూసేటప్పుడు మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు’ అంటూ పోస్టు పెట్టింది. 


నటనకు కొత్తేం కాదు
పూజ సినీ పరిశ్రమకు, నటనకు కొత్తేం కాదు. ఆమె గతంలోనే దర్శకుడు ఏఎల్ విజయ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. అలాగే 2017లో విడుదలైన కారా అనే షార్ట్ ఫిల్మ్ లోనూ నటించింది. అప్పట్నించి వెండితెర ఎంట్రీ కోసం వేచి చూసింది. చివరకు తమిళ సినిమా ద్వారా పరిచయం అవుతోంది. ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే కథగా తెలుస్తోంది. కనుక కథే హీరో అని చెప్పుకోవాలి. సిల్వ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ధనుష్ ట్విట్టర్ లో విడుదల చేశారు. పోస్టర్లను బట్టి చూస్తే సినిమా అంతా గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని అర్థమవుతోంది. 


అక్క పోలికలే...
పూజా కన్నన్ అక్క పోలికలతోనే ఉండడం ప్లస్ పాయింట్. ఇద్దరినీ చూస్తే కవలల్లా అనిపిస్తారు. నవ్వు, హెయిర్ స్టైల్ కూడా ఒక్కలానే ఉంటాయి. త్వరలోనే తెలుగు ఎంట్రీ కూడా ఖాయం అంటున్నారు టాలీవుడ్ జనాలు. తెలుగులో సాయిపల్లవికి భారీ ఫాలోయింగ్ ఉంది. అది పూజా కన్నన్ కు కూడా ఉపయోగపడుతుందని టాక్. 



Also Read:  స్కైలాబ్ పోస్టర్‌తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్


Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య
Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి