బిగ్ బాస్ సీజన్ 5లో స్నేహితులుగా హౌజ్ లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్, సిరిల వ్యవహారం అంతకుమించి అనిపిస్తోంది.   బయట పరిస్థితి తెలుసు, ఇద్దరం వేర్వేరు వ్యక్తులతో రిలేషన్లో ఉన్నామని తెలిసినప్పటికీ ఇక్కడ ఏమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నాం అని వాళ్లే ఒప్పుకున్నారు. హోస్ట్  నాగార్జున  కన్ఫెషన్ రూం లోకి పిలిచి మరీ క్లాస్ పీకినా సరే షణ్ముఖ్, సిరి ఆయన ముందు తల ఊపి మళ్లీ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. కుదిరితే ముద్దు లేదంటే హగ్గు అన్నట్టుంది. ఒక్క క్షణం కూడా దూరంగా ఉండడం లేదు. సిరి ప్రవర్తన వల్ల ఆ ప్రభావం తన  ఆటపై పడుతోందని షణ్ముక్ తెలుసుకోలేకపోతున్నాడో లేదా తెలిసినా తనే తగ్గలేకపోతున్నాడో అర్థంకావడం లేదని బుల్లితెర ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. అయితే అందరి మాటా ఓ లెక్క అనుకుంటే సిరి తల్లి కూడా సేమ్ టు సేమ్ అదే మాట అనడం  హాట్ టాపిక్ అయింది.  






 తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముందంటే.. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ లో భాగంగా 'చుక్‌ చుక్‌ చుక్‌' అంటూ బజర్‌ వచ్చిన ప్రతిసారీ ఇంటిసభ్యులంతా రైలు బోగీల్లా మారి పరుగులు తీయాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ పరిగెత్తాల్సి ఉంటుంది. ఈ గేమ్ మధ్యలోనే ఫార్వర్డ్, పాజ్ అంటూ బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను హౌస్ మేట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ గేమ్ కొనసాగుతుండగానే మధ్యలో ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ ని హౌజ్ లోకి పంపించారు. ఈ రోజు షోలో భాగంగా మానస్ తల్లి , సిరి తల్లి హౌజ్ లో సందడి చేశారు. మానస్ మదర్ కుటుంబ సభ్యులందరితో బాగా సందడి చేసింది. సిరి తల్లి మాత్రం బాగా ఆడుతున్నావ్ కానీ చీటికి మాటికీ షణ్ముక్ ని హగ్ చేసుకోవడం నచ్చలేదని షాకిచ్చింది. తను నీకు హెల్ప్ చేస్తున్నాడు కానీ బాగా దగ్గరైపోతున్నావని చెప్పింది. దీంతో వీళ్ల ప్రవర్తన సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ అయింది.
Also Read: కాష్మోరా ప్రయోగిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. 'తులసీ దళం' కి మించి 'తులసి తీర్థం'.
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు సోనూసూద్ భరోసా.. నేను సాయం చేస్తా!
Also Read: 'నగలు తిరిగిచ్చేయ్'.. ఆ లెటర్ నిజంగానే ఉదయ్ కిరణ్ రాశాడా..?
Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్‌ అనే విషయం మర్చిపోయిందా..?'
Also Read: డిసెంబర్ బరిలో మరో యంగ్ హీరో.. డేట్ లాక్ చేసేసుకున్నాడు..
Also Read: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. మెగాపవర్ మాస్.. రెడీగా ఉండండి..
Also Read: సముద్రం అడుగున హోటల్ గదిలో పూజా హెగ్డే.. ఆ అందాలను చూస్తే మతి పోతుంది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి