వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల వర్మ మళ్లీ భయపెట్టైందుకు సిద్ధమయ్యాడు. అయితే హర్రర్, లేదంటే  ఫ్యాక్షన్.. ఈ రెండూ కాకుంటే హాట్ ఇవీ ఆర్జీవి మూవీస్. ఓ వైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట ఇష్యూస్ పై కామెంట్స్ తో బిజీ బిజీగా ఉంటాడు. చివరకు కరోనా సమయంలో కూడా అంతా ఇంటికేపరిమితమైనప్పుడూ వర్మ తన వర్క్ కి బ్రేక్ ఇవ్వలేదు. ఇప్పటికే కొండా సురేఖ దంపతులపై సినిమా తెరకెక్కిస్తున్న వర్మ.. తాజాగా తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకి    ”తులసి తీర్థం” అనే టైటిల్‌  ఫిక్స్‌ చేశాడు. 






తులసి తీర్థం పోస్టర్ విడుదల చేసిన వర్మ.. 'నా తదుపరి భయానక చిత్రం 'తులసి తీర్ధం',  యండమూరి వీరేంద్రనాథ్ రచించిన సంచలనాత్మక షాకింగ్ నవల “తులసి దళం”కి సంభావిత సీక్వెల్ దీన్ని భీమవరం టాకీస్ నిర్మించింది.' అంటూ ట్వీట్ చేశాడు. మూడు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు పాఠకులను మెప్పించిన “తులసీదళం" నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఈ నవల సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.ఇప్పుడు దీనికి సీక్వెల్ అన్నట్టుగా తెరకెక్కనున్న 'తులసితీర్థం' అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. 
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు సోనూసూద్ భరోసా.. నేను సాయం చేస్తా!
Also Read: 'నగలు తిరిగిచ్చేయ్'.. ఆ లెటర్ నిజంగానే ఉదయ్ కిరణ్ రాశాడా..?
Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్‌ అనే విషయం మర్చిపోయిందా..?'
Also Read: డిసెంబర్ బరిలో మరో యంగ్ హీరో.. డేట్ లాక్ చేసేసుకున్నాడు..
Also Read: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. మెగాపవర్ మాస్.. రెడీగా ఉండండి..
Also Read: సముద్రం అడుగున హోటల్ గదిలో పూజా హెగ్డే.. ఆ అందాలను చూస్తే మతి పోతుంది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి