Acharya Update: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. ఊరించి ఉసూరుమనిపించిన ‘ఆచార్య’ టీమ్

ఆచార్య సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. చిరంజీవితో కలిసి నటిస్తున్న రామ్ చరణ్ ఇందులో సిద్ధగా ఆకట్టుకోనున్నాడు.

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా కానుకగా విడుదల కావాలనుకున్న ఈ సినిమా ఇప్పుడు 2022 ఫిబ్రవరికి వెళ్లింది. ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. 

Continues below advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, రెండు పాటలను విడుదల చేశారు. ఇందులో 'లాహే లాహే' అనే పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. తాజాగా చిత్రబృందం మరో అప్డేట్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ 'సిద్ధ' అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్టర్స్ కూడా వదిలారు. అయితే తాజాగా సినిమాలో ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్ ను విడుదల చేయనున్నారు. 

దీన్ని నవంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మెగాస్టార్ మాస్ ను చూశారని.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ మాస్ ని చూడడానికి రెడీ అవ్వమంటూ.. డేట్ ను లాక్ చేశారు. ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు నటిస్తున్నారు. సోనూసూద్, జిషు షేన్ గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

Continues below advertisement
Sponsored Links by Taboola