ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించిన వ్యక్తి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగాడు. హిట్టు మీద హిట్టు అందుకుంటూ.. నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. కెరీర్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలతో ఒక్కసారిగా అతడి క్రేజ్ పడిపోయింది. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. మధ్యలో చేసిన ఒకట్రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు.
దీంతో ఆర్థికంగా ఎంతో ఇబ్బందిపడ్డారు. ఇండస్ట్రీలో ఉదయ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆ తరువాత కొన్నాళ్లకు విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. పెళ్లి తరువాత కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బందులు, భార్యతో గొడవలు వంటి సమస్యలు అతడిని చుట్టుముట్టాయి. అదే సమయంలో జనవరి 5, 2014లో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. అతడి మరణం ఇండస్ట్రీలో పలు చర్చలకు దారి తీసింది.
ఉదయ్ కిరణ్ మరణించి ఏడేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఆయన రాసిన లేఖ ఒకటి బయటకొచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే.. ''విషితా మా అమ్మ అంటే ఎంత ఇష్టమో.. ఆ తర్వాత అంతగా నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచివాడు అని అనుకుంటున్నావు.. కానీ అతను అస్సలు మంచివాడు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు వస్తుంది. కానీ అప్పుడు ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికా వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినీ ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ మ్యాడ్‌గా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓసారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా'' అని రాసి ఉంది.
సోషల్ మీడియాలో అభిమానులు ఈ లెటర్ ను తెగ షేర్ చేస్తున్నారు. మరి ఈ లెటర్ ను నిజంగానే ఉదయ్ కిరణ్ రాశాడా..? లేదా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ఆయన కుటుంబ సభ్యులెవరైనా.. దీనిపై స్పందిస్తారేమో చూద్దాం!
Also Read: డిసెంబర్ బరిలో మరో యంగ్ హీరో.. డేట్ లాక్ చేసేసుకున్నాడు..
Also Read: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. మెగాపవర్ మాస్.. రెడీగా ఉండండి..
Also Read: 'రిపబ్లిక్' సినిమాను థియేటర్లో చూడని సాయితేజ్.. తొలిసారి ఓటీటీలోనే..
Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయిందా..?'
Also Read: స్కైలాబ్ పోస్టర్‌తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్
Also Read: సాయి పల్లవి చెల్లెలి సినిమా విడుదలకు సిద్ధం... త్వరలో తెలుగులో కూడా నటించే అవకాశం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి