సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన సినిమా 'రిపబ్లిక్'. జె.బి. ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు, న్యాయ వ్యవస్థ మధ్య ఎటువంటి సమన్వయం ఉండాలనే కథతో సినిమా రూపొందింది. ఆల్రెడీ థియేటర్లలో విడుదలైన 'రిపబ్లిక్', ఈ నెల 26న 'జీ 5' ఓటీటీలో వీక్షకులకు అందుబాటులోకి  వస్తోంది. అందులో డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేస్తున్నట్టు 'జీ 5' బృందం, దేవ్ కట్టా తెలిపారు. మన దేశంలో ఇటువంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. 


Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్‌ అనే విషయం మర్చిపోయిందా..?'


అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. సాయి తేజ్ ఇప్పటివరకు ఈ సినిమాను థియేటర్లో చూడలేదట. ఆయనకు యాక్సిడెంట్ అయిన కారణంగా చాలా రోజులపాటు హాస్పిటల్ లోనే ఉన్నారు. అదే సమయంలో సినిమాను రిలీజ్ చేశారు. దీంతో థియేటర్లో సినిమాను చూడలేకపోయారు. ఈ విషయాన్ని జీ 5 సంస్థ తెలియజేస్తూ.. సాయి తేజ్ ఈ సినిమాను 25వ తేదీ రాత్రి జీ 5 ఓటీటీ లో చూస్తున్నారని.. బహుశా.. ఓ హీరో తన సినిమాను థియేటర్ లో కాకుండా OTT లో చూడటం ఇదే తొలిసారి అనుకుంట అంటూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జీ 5 కంటెంట్ ప్రసాద్ నిమ్మకాయల వెల్లడించారు.


ఐశ్వర్య రాజేష్ కథానాయికగా... జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి!






Also Read:  స్కైలాబ్ పోస్టర్‌తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్


Also Read: సాయి పల్లవి చెల్లెలి సినిమా విడుదలకు సిద్ధం... త్వరలో తెలుగులో కూడా నటించే అవకాశం


Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య


Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?


Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి