బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా దిశాకు మంచి పేరే తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత దిశా బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. 'ఎమ్ఎస్ ధోనీ', 'భాగీ' సినిమాలు ఆమెకి విజయాలను తీసుకురావడంతో అక్కడే వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఇక దిశాకు ఖుష్బూ అనే సిస్టర్ ఉంది. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తమ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటారు. 


Also Read:  స్కైలాబ్ పోస్టర్‌తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్


ఇదిలా ఉండగా.. మంగళవారం నాడు దిశా సిస్టర్ ఖుష్బూ పటానీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా బర్త్ డే పార్టీలో ఆమె డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీలో టేబుల్ పైకి ఎక్కి మరీ ఖుష్బూ డాన్స్ చేసిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోను దిశా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. తన సోదరికి విషెస్ చెప్పింది. 'హ్యాపీ బర్త్ డే మై క్రేజీ సిస్.. నేను కూడా నీలా డాన్స్ చేయాలని కోరుకుంటున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 


అయితే ఖుష్బూ సింగిల్ పీస్ వేసుకొని అలా డాన్స్ చేయడాన్ని కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు. దానికి కారణం ఏంటంటే.. ఖుష్బూ పటానీ ఆర్మీ ఆఫీసర్. ప్రస్తుతం ఆమె ఇండియన్‌ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. దిశా ఎప్పుడైతే తన అక్క ఆర్మీ ఆఫీసర్ అని వెల్లడించిందో.. అప్పటినుంచి ఆమె బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఆమె డాన్స్ వీడియో వైరల్ అవ్వడంతో కొందరు నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. 'తనొక ఆర్మీ ఆఫీసర్ అనే విషయాన్ని మర్చిపోయిందా..? కొంచెం పద్దతిగా ఉండండి' అంటూ ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. ఇక ఖుష్బూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన జిమ్, వర్కవుట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. 






Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య


Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?


Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి