యంగ్ హీరో నాగ శౌర్య కెరీర్‌లో లాండ్ మార్క్‌గా రాబోతోన్న 20వ చిత్రం లక్ష్యం విడుదల తేదీని ప్రకటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 10న విడుదల కానుంది. 'వరుడు కావలెను' తరువాత నాగ శౌర్య నుంచి 'లక్ష్య' అనే సినిమా రాబోతుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాగ శౌర్య లుక్, ఆ హెయిర్ స్టైల్, బాణాన్ని ఎక్కు పెట్టిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఓ పక్క వర్షం కూడా పడుతున్నట్టు కనిపిస్తోంది.


ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.  ఇక సినిమా మీదున్న అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా పెంచేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య.. ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతోన్నారు. ఈ సినిమాలో నాగ శౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న కథా నేపథ్యంతో సంతోష్ జాగర్లపూడి ప్రేక్షకులను అలరించబోతున్నారు. కాళ భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 


నిజానికి డిసెంబర్ డిసెంబర్ లో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. ముందుగా 'అఖండ'తో మొదలైతే.. ఆ తరువాత కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖీ', అల్లు అర్జున్ 'పుష్ప', నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటితో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. వీటన్నింటి మధ్యలో నాగశౌర్య 'లక్ష్య' కూడా రాబోతుంది. 






Also Read: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. మెగాపవర్ మాస్.. రెడీగా ఉండండి..


Also Read: 'రిపబ్లిక్' సినిమాను థియేటర్లో చూడని సాయితేజ్.. తొలిసారి ఓటీటీలోనే..


Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్‌ అనే విషయం మర్చిపోయిందా..?'


Also Read:  స్కైలాబ్ పోస్టర్‌తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్


Also Read: సాయి పల్లవి చెల్లెలి సినిమా విడుదలకు సిద్ధం... త్వరలో తెలుగులో కూడా నటించే అవకాశం


Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి