వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ప్రాసెసర్, బ్యాటరీ విషయంలో వన్‌ప్లస్ 9 ప్రో కంటే మెరుగ్గా ఈ ఫోన్ ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌ను ఇందులో అందించనున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా కూడా ఇందులో ఉండనుంది. సెల్ఫీ కెమెరాను కూడా అప్‌గ్రేడ్ చేయనున్నారని తెలుస్తోంది.


91మొబైల్స్ కథనం ప్రకారం.. వన్‌ప్లస్ 10 ప్రోలో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. ఐపీ68 రేటింగ్ కూడా ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుందని తెలుస్తోంది.


వన్‌ప్లస్ 10 ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉండనుంది. 8 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఇందులో అందించనున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే వన్‌ప్లస్ 9 ప్రోలో ఉపయోగించిన సెన్సార్లే ఇందులో కూడా ఉండనున్నాయా లేకపోతే కొత్త సెన్సార్లు ఉండనున్నాయా అనే విషయాలు తెలియరాలేదు.


ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ 9 ప్రోలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండగా.. 10 ప్రోలో దీన్ని కూడా అప్‌గ్రేడ్ చేశారు. వన్‌ప్లస్ 10 ప్రోలో కొత్త తరహా డిజైన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే వైరల్ అయ్యాయి.


ఈ లీకైన ఫొటోల ప్రకారం.. వాల్యూమ్ బటన్లు ఫోన్‌కు ఎడమవైపు ఉండనున్నాయి. వన్‌ప్లస్ 10 ప్రోను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే గతంలో వచ్చిన లీకుల ప్రకారం.. ఈ ఫోన్ ముందుగా చైనాలో లాంచ్ అయి.. తర్వాత గ్లోబల్ లాంచ్ కానుంది.


Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?


Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!


Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి