కరోనా.. కొందరిలో మానవత్వాన్ని చంపేస్తే మరికొందరిలో మానవత్వాన్ని తట్టిలేపింది. ఇలాంటి వారిలో ఒకరు సోనూసూద్. సోనూ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, ఎంత రాసినా తక్కువే అయినప్పటికీ మళ్లీ తన గురించి చెప్పాల్సిన సందర్భం ఎందుకొచ్చిందంటే లెటెస్ట్ గా సోనూ చేసిన ట్వీటే కారణం.
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కరోనా సోకడంతో గత ఐదు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు చెప్పారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. శివ శంకర్ మాస్టర్ భార్య హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఆయన చిన్న కొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి వైద్యానికి చాలా ఖర్చవుతోందని అంత మొత్తాన్ని వెచ్చించే పరిస్థితుల్లో లేమని అజయ్ ఆవేదన చెందాడు. దీంతో సోషల్ మీడియాలో కొందరు ఆ కుటుంబానికి సాయం చేయాలంటూ కోరుతూ ట్వీట్స్ చేశారు. దీనిపై స్పందించిన రియల్ హీరో సోనూ సూద్ తానున్నానంటూ అభయహస్తం ఇచ్చారు. ” తాను ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీ తో టచ్ లో ఉన్నాను. వారిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆందోళన అవసరం లేదు” అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.
కొరియోగ్రఫర్ గా శివశంకర్ స్థానం ప్రత్యేకం. 80వ దశకం నుంచి వివిధ భాషలకి చెందిన సినిమాలకి ఆయన డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లోని ఎన్నో సినిమాలకి ఆయన డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ఎంతో మంది స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి ఆయన నృత్య దర్శకత్వాన్ని వహించారు. హీరోల బాడీ లాంగ్వేజ్ వాళ్ల ఏజ్ ను దృష్టిలో పెట్టుకుని డాన్స్ కంపోజ్ చేయడం ఆయన ప్రత్యేకత. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు విని అభిమానులు ఆందోళనచెందుతున్నారు. ఆ కుటుంబం త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
Also Read: 'నగలు తిరిగిచ్చేయ్'.. ఆ లెటర్ నిజంగానే ఉదయ్ కిరణ్ రాశాడా..?
Also Read:డిసెంబర్ బరిలో మరో యంగ్ హీరో.. డేట్ లాక్ చేసేసుకున్నాడు..
Also Read: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. మెగాపవర్ మాస్.. రెడీగా ఉండండి..
Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయిందా..?'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి