ఈ పెద్దోళ్లున్నారే అన్నీ ఇలాగే చెబుతారు అనుకుంటారు కానీ వాళ్లు చెప్పిన ప్రతివిషం వెనుకా ఓ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అయితే సైన్స్ అనే కన్నా దేవుడు, వాస్తు అంటే  సరిగ్గా పాటిస్తామనే ఉద్దేశంతో అలా చెప్పారని గ్రహిస్తే అన్నీ తప్పనిసరిగా పాటిస్తామేమో. అయితే ఇప్పుడు చర్చంతా ఏ దిక్కువైపు తలపెట్టి నిద్రపోవాలి అని. కొందరు నిద్రలేచిన మొదలు మళ్లీ నిద్రపోయేవరకూ అడుగుడుగునా వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తుంటారు. చివరకు ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా ఏ దిక్కుగా ముందు అడుగేయాలని చూసుకుంటారు. మిగిలిన విషయాల్లో అంతో ఇంతో తగ్గినా ఏ దిక్కున తలపెట్టుకోవాలనే దానిని తప్పకుంటా పాటించేవారి సంఖ్య చాలా ఎక్కువ. 
Also Read:  రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
వాస్తుశాస్త్రం  ప్రకారం
తూర్పు
తూర్పు దిక్కు ఇంద్ర స్థానం, కుబేర స్థానం. అందుకే  నిద్రించేటప్పుడు తూర్పు కి తలబెట్టుకోవడం అన్ని విధాలమంచిదని చెబుతారు. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు. అందుకే దేవతలుండేవైపు తలబెట్టి పడుకుంటే వారి అనుగ్రహం కలుగుతుందంటారు.  ఈ దిక్కువైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందట.
పడమర
 పడమటి దిశలో ఎప్పుడూ తలపెట్టి నిద్రించకూడదు. ఎందుకంటటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్లు తూర్పు దిక్కులో ఉంటాయి. తూర్పు దిక్కు దేవతలను సూచిస్తుంది కాబట్టి ఈ దిశగా కాళ్లు పెట్టడం దోషం అంటారు. 
దక్షిణం
ఇది యమ స్థానం. దక్షిణ దిక్కు యమునికి చెందిన దిక్కు కాబట్టి అటు వైపు కాళ్ళు కాకుండా తలపెట్టుకోవాలని చెబుతారు. ఆరోగ్యానికి, ఆయుష్షుకి చాలా మంచిదని చెబుతారు. 
ఉత్తరం 
ఈ దిక్కుకి  అధిపతి కుబేరుడు కానీ మనుషులు ఆ దిక్కుగా తల పెట్టుకోరాదు. ఎందుకంటే కేవలం శవాన్ని మాత్రమే ఉత్తరం వైపునకు పెడతారు. మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెడితే దక్షిణ దిశ యముడిస్థానం కావడంతో చావుకి ఎదురెళ్లినట్టే అంటారు వాస్తు నిపుణులు. ఈ దిశలో నిద్రపోవడం వల్ల పీడకలలు వచ్చే అవకాశం ఉండటమే కాదు మనస్సు కూడా నియంత్రణలో ఉండదంటారు.
గ్రహాలు, నక్షత్రాలు అన్నీ పడమటి నుంచి తూర్పువైపు పయనిస్తుంటాయి. అందుకే తూర్పు, దక్షిణం వైపు శిరస్సుంచి పడుకోవడం మంచిదంటారు.
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
సైన్స్ ప్రకారం
మనదేశం ఉత్తరార్ధ గోళంలో ఉండడం వలన సైన్ ప్రకారం అయస్కాంత తరంగాలు  ఉత్తరంవైపు నుంచి పడమర మీదుగా దక్షిణం వైపు ప్రయాణిస్తాయి. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మెదడులోని శక్తిమంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దానివల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు రావడమే కాక, రక్తప్రసరణలో మార్పు వస్తుందంటారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇలా చేస్తే వారిలో పెద్దగా ప్రమాదం ఏమీ కనిపించకపోవచ్చు. కానీ వాళ్లు కూడా నిద్రలేస్తూనే ఆందోళనగా కనిపిస్తారు. పెద్దలు మాత్రం చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం తప్పదంటారు.  మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే తలనొప్పి ,గందరగోళం ,మెదడు చురుకుదనం తగ్గడం వంటి ప్రభావాలు కనిపిస్తాయంటున్నారు  నిపుణులు. 
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: దొంగలే పాలకులు.. పాలకులే దొంగలు...కలికాలం అంటే ఇదే
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: 1008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!
Also Read:  సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి