భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌తో తెలుగు వారిని ఆకట్టుకున్న కిన్నెర మొగులయ్యకు తెలంగాణ ఆర్టీసీ మంచి ఆఫర్ ప్రకటించింది. కిన్నెర మొగులయ్య ఈ మధ్య చాలా పేరు సంపాదించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీపై ఆయన పాడిన పాటతో మొగులయ్య పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. తాజాగా మరోసారి కిన్నెర మొగులయ్య టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిశారు. ఈ సందర్భంగా మొగులయ్యకు వీసీ సజ్జనార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.


కిన్నెర మొగులయ్య కుమార్తె వివాహం ఇటీవలే జరిగింది. ఈ శుభ కార్యానికి మొగులయ్య ఆర్టీసీ బస్సును ప్రత్యేకంగా బుక్ చేసుకున్నారు. ఆ శుభకార్యం అయిపోయాక బస్సు ముందు నిలబడి ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ తనదైన శైలిలో పాట అందుకున్నారు. అది బస్సు కాదు.. తల్లిలాంటిదని.. శభాష్ సజ్జనార్ సర్.. అంటూ ప్రశంసించారు. ఆ పాట అచ్చం భీమ్లా నాయక్ ట్యూన్‌లోనే ఉండడంతో అందర్నీ ఆకట్టుకుంది. కిన్నెర వాయిద్యం వాయిస్తూ పాడిన ఆ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఆనందకరమని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఈ పాట ద్వారా మొగులయ్య ప్రజలకి సందేశం ఇచ్చారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.


ఈ క్రమంలోనే మొగులయ్యను బస్‌ భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ బుధవారం సన్మానించారు. ఆర్టీసీ బస్సుల్లో (కేటగిరీపై పరిమితితో) రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్‌ను మొగులయ్యకు అందజేశారు. భవిష్యత్తులో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఆర్టీసీ సేవలను తన పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎండీ సజ్జనార్‌ ఆకాంక్షించారు.










Also Read: తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !


Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు ! 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి