ప్రతి రైతుకూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు రైతు కుబేరుడైపోతాడు. అలాంటి రోజున అప్పటి వరకూ తాను రూ. వేయికే అమ్మిన పంటను రూ. పది లక్షలు పెట్టి కొనడానికి వ్యాపారులు పరుగులు పెట్టుకుటూ వస్తారు. ఇలాంటి రోజు ఇప్పుడు టమోటా రైతులకు వచ్చాయి. కారణం ఏదైనా కానీ ఇప్పుడు టమోటా రైతు పంట పండింది. ఇలా టమోటాలను మార్కెట్లోకి తీసుకు రావడం ఆలస్యం..అలా కొనేస్తున్నారు వ్యాపారులు. ఇప్పుడు పొలం దగ్గరకే వస్తున్నారు. ఇక రేటు సంగతి చెప్పాల్సిన పని లేదు. కర్నూలు జిల్లాలో ఒక రైతు టమోటా మీద రూ. 80 లక్షల ఆదాయం కళ్ల జూశాడంటే రేటు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : సెంచరీ దాటిన టమాటా ధరలు...మరి ప్రత్యామ్నాయంగా ఏం తినాలంటే...
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో రైతులు టమోటా పంటను పండిస్తూ ఉంటారు. అక్కడ సాయిబాబా తన సోదరులతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తూంటాడు. ఎక్కువగా టమాటానే పండిస్తారు. ఈ సారి కూడా దాదాపు 40 ఎకరాల్లో టమోటా పంటను సాగు చేశారు. పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. అయితే రేటు ఎలా ఉంటుందో అని వారు టెన్షన్ పడుతున్న సమయంలో వారి దశ తిరిగిపోయింది. ప్రస్తుతం టమోటా ధర సెంచరీ దాటడంతో దాదాపు రూ.80 లక్షలు రూపాయలు ఆదాయం కళ్ల జూశారు.
Also Read: 1008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!
సాయిబాబా ఆయన సోదరులకు కలిసి దాదాపు వీరికి 100 ఎకరాలు ఉండగా, అందులో ఈ సీజన్‌లో 40 ఎకరాలలో టామోట పంటను సాగు చేశారు. అది ఇప్పుడు సిరులు కురిపించింది. వీరి తండ్రి ఎర్రమోద్దీన్ రెండు ఎకరాలతో వ్యవసాయం ప్రారంభించారు. ఈయనకు ఐదుగురు కుమారులు. తండ్రి తదనంతరం వీరంతా వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. కష్టనష్టాలకు ఎదురైనా భూమిని నమ్ముకుని సాగు చేస్తూ పంట పండిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి వారి పంట టమాటా రూపంలో పండింది.
Also Read: అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !
అయితే రైతులకు ఈ పరిస్థితి లాటరీలా మారడమే ఇబ్బందికరంగా ఉంది. ఎక్కువ సార్లు టమాటాకు రేట్లు రాక.. మార్కెట్ల వరకు తీసుకెళ్లేందుకు అవసరమైన రవాణా చార్జీలు కూడా రాక నేల మీద పారబోయాల్సిన పరిస్థితి వస్తోంది. అలాంటి పరిస్థితులు రాకూడదని.. రైతులకు నిలకడైన ఆదాయం రావాలని ఈ రైతులు కూడా కోరుకుంటున్నారు.
Also Read: చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి