ABP  WhatsApp

Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?

ABP Desam Updated at: 25 Nov 2021 01:25 PM (IST)
Edited By: Murali Krishna

రహదారులు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలని రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

'రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?

NEXT PREV

రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రహదారులు నటీమణులు హేమామాలిని, కత్రినా కైఫ్‌ బుగ్గల్లా ఉండాలని రాజస్థాన్‌ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర సింగ్‌ గుఢా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో మీరు చూడండి.



ఝుంఝునూ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్లు దారుణంగా  ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేయగా రాజేంద్ర సింగ్‌ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు  చేశారు.







రోడ్లు హేమమాలిని బుగ్గల్లా ఉండాలి. కానీ ఆమె చాలా ఓల్డ్‌ అయిపోయారు. నా నియోజకవర్గంలో రోడ్లు కత్రినా కైఫ్‌ బుగ్గల్లా ఉండాలి.                                 - రాజేంద్ర సింగ్ గుఢా, రాజస్థాన్ మంత్రి


రాజకీయ నాయకులు రహదారులను సినీతారల బుగ్గలతో పోల్చడం ఇదేం తొలిసారి కాదు.



  • 2005లో ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా రహదారుల్ని హేమమాలిని బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ హామీ ఇచ్చారు. అప్పట్లో అది వివాదాస్పదమైంది.

  • 2013లో యూపీలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారాం పాండే ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో రహదారులను సినీతారలు హేమమాలిని, మాధురీ దీక్షిత్‌ బుగ్గల్లా నిర్మిస్తామంటూ చెప్పారు.

  • మధ్యప్రదేశ్‌ న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ కూడా 2019లో తమ రాష్ట్రంలో గుంతలమయమైన రోడ్లను సుందరంగా.. ‘డ్రీమ్‌గర్ల్‌’ స్టార్‌ బుగ్గల్లా మారుస్తామంటూ వ్యాఖ్యానించారు.


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం


Published at: 25 Nov 2021 01:22 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.