దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 9,119 కేసులు నమోదుకాగా 396 మంది మృతి చెందారు. 10,264 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.







యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,09,940కి చేరింది. గత 539 రోజుల్లో ఇదే అత్యల్పం. 






రికవరీ రేటు  98.33%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. మొత్తం రికవరీల సంఖ్య 3,39,67,962కు పెరిగింది.


కేరళ..


కేరళలో కరోనా కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 51,02,125కు పెరిగింది. కొత్తగా 4,280 కరోనా కేసులు నమోదవగా 308 మంది మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. మొత్తం మృతుల సంఖ్య 38,353కు పెరిగింది.


మొత్తం 14 జిల్లాల్లో తిరువనంతపురంలో అత్యధికంగా 838 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులం (825), త్రిస్సూర్ (428) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


గత 24 గంటల్లో 48,916 కరోనా శాంపిళ్లను పరీక్షించారు.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 960 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు. గత నాలుగు రోజులుగా రోజువారి కేసులు 10 వేల కంటే తక్కువగా ఉన్నాయి.


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం