ఐపీఎల్ 2022 సీజన్ వేలం డిసెంబర్లో జరగనుంది. తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఈ లోపు రీటెయిన్ చేసుకొనే ఆటగాళ్ల జాబితాలు ఇవ్వాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ కోరినట్టు తెలిసింది. ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను తీసుకోవచ్చని బోర్డు తెలిపింది. ముగ్గురు భారతీయులు- ఒక విదేశీయుడు లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీయులను తీసుకోవచ్చని సమాచారం.
రీటెయిన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా సమర్పణకు ఆఖరు తేదీ నవంబర్ 30. కాగా చెన్నై సూపర్‌కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే జాబితాలను బోర్డుకు సమర్పించాయని తెలుస్తోంది. మిగిలిన జట్లు త్వరలోనే జాబితాను ఇవ్వనున్నాయి.
- చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ/సామ్ కరణ్
- దిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, ఆన్రిచ్ నార్జ్
- ముంబయి ఇండియయన్స్: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్ (దాదాపుగా)
- కోల్‌కతా నైట్‌రైడర్స్: సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్
ఎంఎస్ ధోనీని మరో మూడేళ్లకు ఆడించాలని చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ భావిస్తోందట! ఇక పంజాబ్ కింగ్స్‌తో కెప్టెన్ కేఎల్ రాహుల్ బంధం తెంచుకోనున్నాడు. కొత్తగా వస్తున్న లఖ్‌నవూ ఫ్రాంచైజీకి అతడు సారథ్యం వహిస్తాడని తెలుస్తోంది. ఈ మేరకు వారిచ్చిన ఆఫర్‌కు రాహుల్ అంగీకరించాడని సమాచారం. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ సంగతి ఇంకా తెలియలేదు.
Also Read: IPL 2022 Auction: శ్రేయస్‌కు షాకిచ్చిన దిల్లీ..! తామిద్దరినీ రీటెయిన్ చేసుకోవడం లేదన్న అశ్విన్
Also Read: Gambhir on Ajinkya Rahane: రహానె లక్కీ అనే చెప్పాలి మరి! గంభీర్ ఎందుకిలా అన్నాడో తెలుసా?
Also Read: KL Rahul Ruled Out: టీమ్‌ఇండియాకు షాక్..! కేఎల్ రాహుల్‌కు గాయం.. కివీస్‌తో టెస్టు సిరీసుకు దూరం!
Also Read: Ind vs Nz, 1st Test: అరెరె..! కోహ్లీని పలకరించిన ఈ కొత్త గెస్ట్ ఎవరో తెలుసా!!
Also Read: IPL 2022: ఐపీఎల్ 2022 మొదలయ్యేది ఆరోజే? మొదటి మ్యాచ్ ఎక్కడ.. ఎవరికి?