భారతీయులు క్రికెట్‌ను ఎంతగా ప్రేమిస్తారో చెప్పక్కర్లేదు. టెస్టు మ్యాచ్‌లతో సహా దేన్ని విడిచిపెట్టకుండా చూసేస్తారు. అలాంటిది క్రికెట్ వరల్డ్ కప్ వస్తే.. వదిలి పెడతారా? తప్పకుండా చూసి తీరాల్సిందే. అయితే, క్రికెట్ చరిత్రలో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఓ ఘటన చోటుచేసుకుంది. తొలిసారి ఇండియా ప్రపంచ కప్ గెలుచుకుంది. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో.. అన్ని అంచనాలను తారుమారు చేస్తూ.. ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ఆ అపురూప ఘట్టాన్ని ఇప్పుడు సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారు. ‘83’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ శుక్రవారం విడుదల చేసింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ వేదికగా ఈ టీజర్‌ను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రను.. రణ్‌వీర్ సింగ్ పోషిస్తుండగా.. తమిళ నటుడు జీవా కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. మిగతా పాత్రల్లో దీపికా పదుకొనే, కిచ్చా సుదీప్, జీవా, పంకజ్ త్రిపాఠి, అమ్మీ విర్క్, తహీర్ రాజ్ భాసిన్, సకీబ్ సలీమ్, దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్, కబీర్ ఖాన్, దీపికా పదుకొనే, విష్ణు వర్దన్ ఇందూరి, సజీద్ నదియాద్‌వాలా నిర్మాతలు.
ఇక టీజర్ విషయానికి వస్తే.. 1983, జూన్ 25న లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో.. ఆటను మలుపు తిప్పిన కీలకమైన క్యాచ్‌ను పట్టుకొనేందుకు ఫీల్డర్లు పరుగులు పెడుతున్న సీన్‌ను చూపించారు. ఈ నెల (నవంబరు) 30న ట్రైలర్ విడుదల కానుంది. కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు ప్రపంచ కప్పును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అప్పటి టీమ్ నుంచి ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ షూటింగ్‌లో పాల్గోవడనికి ముందు కొన్నాళ్లు కపిల్ దేవ్‌తో కలిసి ఉన్నాడు. ఆయన ఆట తీరు, హవభావాలను దగ్గరుండి గమనించాడు. టీజర్ చూస్తుంటే.. తప్పకుండా సినీ, క్రికెట్ ప్రేమికులను ఈ చిత్రం మెప్పిస్తుందనే అనిపిస్తోంది. ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది.
Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం
Also Read: ‘లైగర్’ స్టార్ మైక్ టైసన్‌కు గంజాయిని ప్రోత్సహించే బాధ్యతలు.. ప్రభుత్వం విజ్ఞప్తి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి