మహిళలు, బాలికలపై రోజూ జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు సమాజాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా వ్యవహరించినా చాలా మందిలో మార్పు రావడం లేదు. నీలి చిత్రాల ప్రభావమో లేక పెంపకంలో లోపమో కానీ, చివరికి కొందరు కామాంధుల్లా ప్రవర్తించి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అయితే, తాజాగా ఓ యువకుడు మరో మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మరింత విస్మయం కలిగిస్తోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోనే జరిగింది.


హైదరాబాద్‌లో పోలీసులు బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని పార్శీ గుట్ట ప్రాంతంలోని మధురా నగర్ కాలనీకి చెందిన సతీశ్ అనే 23 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇతను సికింద్రాబాద్‌లో కలర్ స్టోన్స్ అమ్మే ఓ షోరూంలో పని చేస్తున్నాడు.


ఈ నెల 24న సాయంత్రం వేళ పార్శీ గుట్టకు చెందిన 13 ఏళ్ల బాలుడిని తనతో తీసుకెళ్లాడు. ‘నీకు చాక్లెట్లు ఇస్తా.. నాతో రా’ అంటూ బాలుడ్ని చెట్లు అధికంగా ఉండే ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో తెలియక తీవ్రమైన భయం, ఆందోళనకు గురైన బాలుడు వెంటనే ఇంటికి పరిగెత్తుకొని వచ్చి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పేశాడు. తల్లిదండ్రులు వెంటనే చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి, సదరు యువకుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా చిలకలగూడ పోలీసులు వెల్లడించారు.


Also Read: యువతిపై ఫేస్‌బుక్ ఫ్రెండ్ దారుణం.. కదులుతున్న కారులో అత్యాచారం.. ఆపై దారుణమైన స్థితిలో..!


Also Read: అక్కాచెల్లెళ్లపై ఐదేళ్లుగా అత్యాచారం.. మాస్టర్ ప్లాన్ వేసిన భూత వైద్యుడు, అతని కొడుకుతో కూడా..


Also Read: Sujana CEO : సుజనా ఫౌండేషన్ సీఈవో హత్య ? బెంగళూరు రైల్వే ట్రాక్‌పై మృతదేహం !


Also Read: Snake Bite: పాము కరిచింది.. పసుపుతో కట్టు కట్టి నిద్రపుచ్చారు.. చివరికి..


Also Read: కాష్మోరా ప్రయోగిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. 'తులసీ దళం' కి మించి 'తులసి తీర్థం'.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి