దక్షిణాది ఇండస్ట్రీలో సమంతకి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ప్రాజెక్టుల ఎంపికలో అయినా, నటన పరంగా అయినా సామ్ ని చూసి కొత్తమ్మాయిలు నేర్చుకోవాల్సిందే. ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే క్రేజ్ సంపాదించుకోవడం మాత్రమే కాదు ఇప్పటికీ ఆ క్రేజ్ నిలబెట్టుకుంటూ వచ్చింది. త్వరలో సామ్ బాలీవుడ్  లో అడుగుపెట్టబోతోందని మరింత ఎదిగిపోతుందని అంతా ప్రచారం చేశారు. అయితే అంచనాలకు అందకుండా సామ్ ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది.  ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 






‘అరెంమెంట్స్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ  సినిమాకి గతంలో ‘డోంటన్ అబ్బే’మూవీ రూపొందించిన ఫిలిప్ జాన్ దర్శకుడు. ఈ సినిమాలో సామ్ 27 ఏళ్ల ద్విలింగ మహిళగా బోల్డ్ పాత్రలో కనిపించనుంది. టైమేరి మురారి రచించిన బెస్ట్ సెల్లింగ్ నవల ‘అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్‌’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాఫ్టా-విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించడం ఆసక్తికరంగా మారింది. ఫిలిప్ జాన్, సునీతతో కలిసి పని చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సమంత “నా పాత్ర సంక్లిష్టమైన పాత్ర… దానిని పోషించడం నాకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఆతృతగా వేచి చూస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది.‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌’ను సునీతా తాటి ప్రొడక్షన్ హౌస్ గురు ఫిల్మ్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. సమంతతో ‘ఓ బేబీ’ సహ-నిర్మించిన బ్యానర్ ఇది. ఈ మూవీకి సంబంధించి పూర్తి అప్ డేట్స్ త్వరలో తెలియనున్నాయి.  ఈ  ప్రాజెక్ట్‌తో పాటు సమంతకు టాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా రెండు సినిమాలు ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ ఎంట్రీకోసం చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా సామ్ జోరు ఓ రేంజ్ లో ఉంది...
Also Read:  కాష్మోరా ప్రయోగిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. 'తులసీ దళం' కి మించి 'తులసి తీర్థం'.
Also Read: శ్రీరామ్ సిస్టర్ స్వీట్ వార్నింగ్, మానస్ మదర్ కి శ్రీరామ్ కొంటె కాంప్లిమెంట్, సిరీ మదర్ దీ అదేమాట..
Also Read: అందమైన అచ్చతెలుగు గాయని..
Also Read: ఎవరన్నారు వంటలక్క అని.. ఇక్కడ చూడండి మతిపోతుంది...
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు సోనూసూద్ భరోసా.. నేను సాయం చేస్తా!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి