Geetha Madhuri Photos: అందమైన అచ్చతెలుగు గాయని..
చక్కని గాత్రం మాత్రమే కాదు అందమైన రూపం కూడా గీతామాధురి సొంతం. 2008లో వచ్చిన 'నచ్చావులే' సినిమాలోని ‘నిన్నే నిన్నే’ పాటతో ప్రేక్షకులకు చేరువైంది. ఆ పాటకు నంది అవార్డు కూడా అందుకుంది. చిరుతలో చమ్కీ చమ్కీ చమ్కీరే సాంగ్ తో భలే క్రేజ్ వచ్చింది.
లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద శాస్త్రీయ, సినీ, లలిత సంగీతంలో శిక్షణ పొందింది గీత. కులశేఖర్ దర్శకత్వం వహించిన 'ప్రేమలేఖ రాశా' సినిమాలో ఒక పాటతో ఆమె సినీ రంగప్రవేశం చేసింది.
సినిమా పాటలతో పాటు, స్టేజ్ షోలు, రియాలిటీ షోలతో మంచి పేరు సంపాదించుకున్న గీతా
బిగ్ బాస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేసిన గీతా మాధురి సూపర్ సింగర్ షో ద్వారా చాలామంది అభిమానుల్ని సంపాదించుకుంది
హైదరాబాద్ లో చదువుకున్న గీతా బాల్యంలోనే సంగీతం నేర్చుకుంది. 100% లవ్ సినిమాలో అజిత్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నందుని 2014లో పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమార్తె.
సింగర్ గీతామాధురి పిక్స్ (Image credit: Instagram)