వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ వాహన బీమా పాలసీలు చేస్తున్న రెండు ముఠాలకు చెందిన 8 మంది నిందితులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఈ కేసు వివరాలు మంగళవారం వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నిందితుల నుంచి 4 లక్షల 46 వేల నగదు, 3 లాప్ టాప్ లు, 2 డెస్క్ టాప్ కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, 5 ద్విచక్ర వాహనాలు, పది సెల్ ఫోన్లతో పాటు 433 వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్, రోడ్ రవాణా శాఖకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులు వరంగల్ తో పాటు హన్మకొండ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు అని వరంగల్ సీపీ తరుణ్ జోషి హెచ్చరించారు.



Also Read: పేస్ట్ రూపంలో గోల్డ్ స్మగ్లింగ్... విమానం సీట్ కింద సీక్రెట్ గా తరలింపు






ప్రభుత్వ ఆదాయానికి గండి


నిందితులు వాహన బీమా రెన్యూవల్‌ చేయించడం, వాహన రిజిస్ట్రేషన్ , లైసెన్సులు ఇప్పించేవారని సీపీ జోషి తెలిపారు. ఆదాయం సరిపోకపోవడంతో నకిలీ బీమా రెన్యువల్‌పై దృష్టి పెట్టారన్నారు. దీనికోసం పలు యాప్స్, సాఫ్ట్​వేర్‌లను సేకరించి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. వాహనదారుల నుంచి 2 నుంచి 10 వేల రూపాయాలు వసూలు చేసే వారని సీపీ వెల్లడించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కార్యాలయాలపై దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.90 లక్షల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని సీపీ జోషి స్పష్టం చేశారు. 


Also Read: దర్యాప్తు అలా కాదు.. ఇలా చేయండి..! వివేకా హత్య కేసులో సీబీఐ డైరక్టర్‌కు అరెస్టయిన నిందితుడి లేఖ !


Also Read: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత... ఓ ప్రయాణికుడి వద్ద 9 ఐఫోన్లు స్వాధీనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి