డిసెంబర్‌ నెలలో మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఇవి మీ ఆర్థిక లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపించనున్నాయి. డబ్బు పరంగా జరుగుతున్న ఆ ఐదు మార్పులు ఇవే..!


SBI Credit Card EMI Processing Fee । ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు ఈఎంఐపై రుసుము


ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు దారులు ఇకపై ఈఎంఐ లావాదేవీలపై రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 1 నుంచి ఈఐంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్‌ రుసుము వసూలు చేయడమే ఇందుకు కారణం. వెబ్‌సైట్‌, ఆన్‌లైన్‌, ఈ-కామర్స్‌, నేరుగా దుకాణాల్లో కొనుగోలు చేసి వాటిని ఈఎంఐగా మార్చుకుంటే రూ.99+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.


PNB interest rates । సేవింగ్స్‌పై వడ్డీరేటు తగ్గింపు


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీరేట్లను మరింత తగ్గించింది. దాదాపు పది బేసిస్‌ పాయింట్ల మేరకు కోత విధించింది. రూ.10లక్షల కన్నా తక్కువ మొత్తం ఉండే ఖాతాలపై 10 పాయింట్లు, రూ.10 లక్షల కన్నా ఎక్కువ మొత్తం ఉండే ఖాతాలపై 5 పాయింట్ల మేర కోత పడనుంది. అంటే వార్షికంగా 2.80 నుంచి 2.85 శాతం మేర ప్రభావం ఉంటుంది.


Jeevan Pramaan Patra । లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువు ముగిసింది


పింఛన్‌దారులు జీవన ప్రమాణ పత్రం దాఖలు చేసే చివరి తేదీ నవంబర్‌ 30న ముగిసింది. అయితే ఈపీఎఫ్‌వో నుంచి పింఛను పొందే ప్రైవేటు ఉద్యోగులు ధ్రువపత్రం సమర్పించేందుకు గడువు వేరే ఉంటుంది. ఆ గడువు లోపు వీరు లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే లబ్ధిదారులకు ప్రయోజనాలు నిలిచిపోతాయి.


UAN-Aadhar Linking । పీఎఫ్‌- ఆధార్‌ అనుసంధానం


ఆధార్‌-ఈపీఎఫ్‌వో అనుసంధానం చేసేందుకు ఆఖరు తేదీ నవంబర్‌ 30తో ముగిసింది. ఒకవేళ మీరు ఆ తేదీలోపు యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌తో ఆధార సంఖ్య లింక్‌ అవ్వకపోతే సంబంధిత ప్రయోజనాలు ఈ నెలతో నిలిచిపోతాయి. ఇకపై యజమాని నుంచి వచ్చే కంట్రిబ్యూషన్‌ ఆగిపోతుంది. పీఎఫ్‌లోని నిధులును ఉపసంహరించేందుకు వీలుండదు.


ITR Filing । ఆదాయపన్ను దాఖలు


ఆదాయపన్ను దాఖలు (ITR) చేసేందుకు 2021, డిసెంబర్‌ 31 చివరి తేదీ. గడువులోపు పన్ను వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇన్‌కం టాక్స్‌ కొత్త వెబ్‌సైట్‌లో ఇబ్బందులు ఉండటంతో గడువును ఈ నెలాఖరుకు పెంచారు. ఇలా గడువు పెంచడం ఇది రెండోసారి. కొవిడ్‌ రెండో వేవ్‌ వల్ల జులై 31న ముగిసిన గడువును సెప్టెంబర్‌ 30కి పెంచారు. ఇప్పుడు మరోసారి పెంచారు.


Also Read: Cryptocurrency Prices Today: పెరుగుతున్న క్రిప్టో ధరలు..! భయం పోయిందా..?


Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది


Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..


Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు మళ్లీ గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, మరింత పడిపోయిన వెండి.. నేటి ధరలివే..


Also Read: Petrol-Diesel Price, 1 December: గుడ్‌న్యూస్, ఈ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ మాత్రం పెరుగుదల.. తాజా రేట్లు ఇవీ..


Also Read: Star Health IPO: స్టార్‌ హెల్త్‌ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి