ఆరోగ్య బీమా రంగంలో అగ్రశ్రేణి కంపెనీ 'స్టార్‌ హెల్త్' ఐపీవో మొదలైంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బీమా కంపెనీ కావడంతో మదుపర్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2021లో మార్కెట్లో 15.8 వాతం వాటా ఈ కంపెనీదే. ఒకవేళ మీరు ఐపీవోకు దరఖాస్తు చేయాలనుకుంటే ముందు ఈ సమాచారం తెలుసుకోండి.


వివరాలు



  • ఐపీవో పరిమాణం: ₹7,249 కోట్లు

  • తాజా ఇష్యూ: ₹2,000 కోట్లు

  • ఆఫర్‌ ఫర్‌ సేల్‌: ₹5,249 కోట్లు

  • షేర్ల ధర: ₹870-₹900 కోట్లు

  • ఫేస్‌ వాల్యూ: ఒక షేరుకు ₹10 


ఎప్పుడేంటి?


స్టార్‌ హెల్త్‌ ఐపీవో 2021, నవంబర్‌ 30న మొదలై డిసెంబర్‌ 2న ముగుస్తుంది. డిసెంబర్‌ 7న షేర్ల కేటాయింపు జరుగుతుంది. ఆ మరుసటి రోజే షేర్లు కేటాయించని వారి డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు. 10న స్టాక్‌మార్కెట్లో నమోదు అవుతుందని అంచనా.


ఇవి గమనించండి



  • దేశంలో బీమా రంగం వృద్ధి చెందుతోంది. విదేశాల్లో బీమా రంగం వాటా జీడీపీలో 2 శాతం ఉంటే భారత్‌లో 0.3 శాతమే. మున్ముందు ఇది పెరిగే అవకాశం ఉంది.

  • స్టార్‌హెల్త్‌ 2006లో మొదలైంది. 2021 ఆర్థిక ఏడాదికి మార్కెట్లో 15 శాతం సాధించింది. ఈ కంపెనీ రిటైల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌పై ఎక్కువ దృష్టి సారిస్తోంది. 2021లో 2 కోట్ల మందిని బీమా పరిధిలోకి తీసుకొచ్చింది.

  • వ్యక్తిగత బీమా ఏజెంట్ల ద్వారానే 80 శాతం బిజినెస్‌ జరుగుతోంది. కనీసం 5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. ఇంకా ఆన్‌లైన్‌, బ్రోకర్లు, వెబ్‌ అగ్రిగేటర్ల ద్వారా బీమాలు అమ్ముతోంది.

  • 2021లో కంపెనీ GWP రూ.9,348 కోట్లుగా ఉంది. ఆ తర్వాత ఉన్న HDFC Ergoతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. రిటైల్‌ బిజినెస్‌ ప్రీమియం ఏటా 31శాతం వృద్ధి చెందుతోంది.

  • బీమా రంగం వృద్ధి చెందుతున్నా కొవిడ్‌ వంటి ఉపద్రవాలతో చాలా కంపెనీలు నష్టాలు నమోదు చేశాయి. కరోనా వల్ల చివరి 18 నెలల్లో స్టార్‌హెల్త్‌ రూ.3,300 కోట్లకు పైగా క్లెయిమ్స్‌ రూపంలో చెల్లించింది.

  • 2020లో రూ.6,891 కోట్ల ప్రీమియం సేకరించగా రూ.268కోట్ల లాభం నమోదు చేసింది. కొవిడ్‌ వల్ల 2021లో రూ.9,349 కోట్ల ప్రీమియం వచ్చినా రూ.826 కోట్ల నష్టం నమోదు చేసింది.

  • స్టార్‌హెల్త్‌ 17 రిటైల్‌ ప్రొడక్టులను ఆఫర్‌ చేస్తోంది. పోటీదారులతో పోలిస్తే ఎక్కువే. చాలామంది ఏజెంట్లు ఉండటంతో స్టార్‌హెల్త్‌ను ఎక్కువగా వారే ప్రమోట్‌ చేస్తున్నారు.

  • FY 18-20లో క్లెయిమ్ రేషియో 65 శాతంగా ఉంది. ఎప్పుడైతే 2021లో కరోనా మహమ్మారి ప్రవేశించిందో ఈ రేషియో 94 శాతానికి చేరుకుంది.

  • బీమా రంగం వృద్ధి చెందుతుంటం లాభమైతే, మొత్తంగా రిటైల్‌ ప్రొడక్టుల ద్వారా బిజినెస్‌ జరుగుతోంది కాబట్టి మార్కెట్లో సమస్యలు ఎదురైతే కష్టమయ్యే అవకాశం ఉంది.


Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత


Also Read: Post Office Scheme: రూ.100తో మొదలుపెట్టే ఈ స్కీమ్‌తో రూ.16 లక్షలు పొందొచ్చు!


Also Read: DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: GST for Auto Ride Booking: కొత్త షాక్‌..! ఆటో బుక్‌ చేసుకుంటే జీఎస్‌టీ మోత.. ఎప్పట్నుంచంటే?


Also Read: Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి