క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ మేరకు తెలిపారు.






డేటా సేకరించడం లేదు..


బిట్‌కాయిన్ లావాదేవీలపై తమ ప్రభుత్వం ఎలాంటి సమాచారం సేకరించడం లేదని సీతారామన్ అన్నారు. దీన్ని కరెన్సీగా గుర్తిస్తారా అన్న ప్రశ్నకు 'లేదు' అని సీతారామన్ సమాధానమిచ్చారు.




బిట్‌కాయిన్ అంటే..


బిట్​కాయిన్ అనేది తొలి క్రిప్టోకరెన్సీ పేరు. 2008లో దీన్ని రూపొందించారు. ఈ కరెన్సీ భౌతిక రూపంలో ఉండదు. ప్రతిదీ డిజిటల్​గానే జరుగుతుంది. బ్లాక్​చైన్ సాంకేతికతపై బిట్​కాయిన్ విలువ ఆధారపడి ఉంటుంది. ఇండియాలో బిట్​కాయిన్​లపై పెట్టుబడులు పెట్టడం చట్టబద్ధమే. బిట్​కాయిన్ ట్రేడింగ్​పై భారత్​లో నిషేధం లేదు. కానీ క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ లేదు. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు లేవు కాబట్టి ఏదైనా వివాదాలు తలెత్తితే.. ప్రభుత్వం నుంచి సహాయం లభించదు.


క్రిప్టో బిల్లు..


ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 'ది క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021'ను తీసుకురానునుంది.


ఆర్‌బీఐ జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీ విధివిధానాలను ఈ బిల్లు ద్వారా జారీ చేయనున్నారు. అలాగే దేశంలోని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించనున్నారు.


Also Read: Parliament Winter Session: సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. రైతుల హర్షం


Also Read: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త



Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


Also Read: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి