నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంటు ఆమోదం పలికింది. విపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి ఉభయ సభలు.
ఈ రోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. వివిధ సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. వెల్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ప్రారంభమైన వెంటనే లోక్‌సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
తిరిగి ప్రారంభమైన వెంటనే..
మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ.. బిల్లుపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అయితే మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు.
రాజ్యసభలో..
రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. విపక్షాల నిరసనల మధ్యే బిల్లుకు పెద్దల సభ ఆమోదం పలికింది.
రైతుల హర్షం..
సాగు చట్టాల రద్దు బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇతర డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు.
Also Read: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త
Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి
Also Read: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి