విమానం ప్రయాణం వేరు. ఎత్తుకు ఎగురుతున్న కొద్దీ చాలా మందికి వికారంగా, వాంతులు వచ్చినట్టు అవుతుంది. అలాంటి వారు కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని తిని విమానమెక్కినా, విమానంలో తిన్నా కూడా మీ ప్రయాణాన్ని ఆస్వాదించలేరు. 


1. ఉల్లి, వెల్లుల్లి
విమాన ప్రయాణంలో ఉల్లి, వెల్లుల్లి అధికంగా ఉన్న వంటకాలను తినకండి. ఎందుకంటే నోరు వాసన వస్తుంది. మీరు మాట్లాడినప్పుడు ఆ వాసన తోటి ప్రయాణికుడికి ఇబ్బందిగా మారుతుంది. 


2. ఆల్కహాల్
కొంతమంది ఆల్కహాల్ తాగి విమానమెక్కుతారు. పైకి ఎగురుతున్నప్పుడు కలిగే భయాన్ని అణచుకోవడానికి ఇలా ఆల్కహాల్ తాగుతారు. కానీ ఏరోస్పేస్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం ఇరుకైన విమానంలో గంటలు గంటలు కూర్చోవడం వల్ల కొంతమందిలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. ఆల్కాహాల్ తాగి విమానమెక్కడం వల్ల ఆ సమస్య మరింత పెరుగుతుంది. 


3. కాఫీ
విమానంలో చాలా మంది కాఫీ తాగుతారు. దీన్ని తాగడం వల్ల కెఫీన్ ఒంట్లో చేరుతుంది. రెండు మూడు సార్లు యూరిన్ కు వెళ్లాల్సి రావచ్చు. ఇది తోటి ప్రయాణికులకు చికాకు కలిగిస్తుంది. 


4. వేరుశెనగపలుకులు
మీరు తినేశాక విమానమెక్కిన ఫర్వాలేదు కానీ, వాటిని బ్యాగులో పెట్టుకుని విమానంలో తినేందుకు ప్రయత్నిస్తే మాత్రం సమస్య ఎదురుకావచ్చు. కొంతమందికి వేరుశెనగపలుకుల వల్ల కూడా అలెర్జీ వస్తుంది. మీరు విమానంలో వేపిన శెనగపలుకులు తినేందుకు రెడీ అయ్యేటప్పుడు వాటి వాసన గాలిలో కలిసిపోతుంది. అదే విమానంలో వేరుశెనగపలుకుల అలెర్జీ ఉన్నవాళ్లు ఉంటే, వారు అనారోగ్యం బారిన పడొచ్చు. తుమ్ములు, దగ్గులతో ఇబ్బంది కలగవచ్చు. 


5. బీన్స్, బఠానీలు
విమానం లోపల గాలి ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల మన పేగులలో 25 శాతం గ్యాస్ ఏర్పడవచ్చు. అలాంటప్పుడు విమానంలో వీటిని తినడం వల్ల పొట్టలో గ్యాస్ మరింత పెరగవచ్చు. దాని వల్ల పొట్ట నొప్పి రావడం, గ్యాస్ బయటికి రావడం వంటివి జరుగుతాయి. 


6. కూల్ డ్రింకులు
శ్వాసకోశ సమస్యలు ఉన్న కూల్ డ్రింకులకు దూరంగా ఉండాలి. విమానంలో తాగితే ప్రయాణసమయంలో ఊపిరి తీసుకునేందుకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎత్తుకు ఎగురుతున్న కొద్దీ ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని కూల్ డ్రింకులు పెంచుతాయి.


Read Also: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు


Read Also:  నేడే రాజ్యాంగ దినోత్సవం... రాజ్యాంగ రూపకల్పనకు ఎంత ఖర్చయిందో తెలుసా?


Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


Read Also: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి