చైనాలో క్రీస్తుపూర్వం నుంచి నమ్ముతున్న శాస్త్రం షెంగ్ షుయ్. దీనిప్రకారం ఇంటిని అమర్చుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని నమ్మకం. షెంగ్ షుయ్ ను ఒక శక్తి ప్రవాహంగా భావిస్తారు చైనాలో. షెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచి డబ్బు రాకుండా నిరోధించేవి, ఒకవేళ డబ్బు అధికంగా వచ్చినా మిగలకుండా ఖర్చయ్యేలా చేసేవి కొన్ని ఉన్నాయి. ఏంటో తెలుసుకుందాం...

1. డస్ట్ బిన్ఇంటి లోపల డస్ట్ బిన్ ను పెట్టకూడదు. ఇంటి బయటే దాని స్థానం ఉండాలి. ఒకవేళ ఇంటిలోపల డస్ట్ బిన్ పెట్టాల్సి వస్తే దాన్ని రోజూ శుభ్రం చేసుకోవాలి. 

2. కుప్పలుగా వస్తువులు పడేయడంచాలా మంది బట్టలు కుప్పలుగా పడేస్తారు. వస్తువులను సర్దుకోకుండా ఒక మూల కుప్పలా పోసి వదిలేస్తారు. అలాంటప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి ప్రతి వస్తువును వాటి వాటి స్థానంలో క్రమపద్ధతిలో అమర్చాలి. 

3. పాత రసీదులు పాత రసీదులు, బ్యాంక్ స్టేట్ మెంట్లు, అప్పులు తాలూక కాగితాలు... ఇలా చాలా పాత ఫైనాన్షియల్ పేపర్లు ఇంట్లో ఉంచుతారు. అలాంటివి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అలాంటి పాత కాగితాలను పడేయండి. ఒకవేళ ఉంచాల్సి వస్తే వాటికి ఓ ప్రదేశాన్ని కేటాయించి అక్కడే క్రమపద్ధతిలో పెట్టాలి. లేదా డిజిటల్ కాపీలుగా మార్చి దాచుకోవడం ఉత్తమం.

4. కిటికీలపై దుమ్ముసానుకూల శక్తి ఇంట్లోకి ప్రవహించాలంటే ఇల్లు దుమ్ము రహితంగా ఉండాలి. కిటికీలను పట్టిన దుమ్మును ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. 

5. ఎండిన మొక్కలుఎండిపోయిన మొక్కలు, చనిపోయిన మొక్కల్ని ఇంట్లో ఉంచుకోకూడదు. మొక్కలను జాగ్రత్తగా పెంచుకోవాలి. వాటిని ఎంత బాగా పెంచితే అంతగా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవహిస్తుంది. 

6. లీకవుతున్న కొళాయిలుచాలా మంది ఇళ్లల్లో కొళాయిలు చుక్కచుక్క కారుతూ ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోరు. నిజానికి అలాంటి కొళాయిలు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. షెంగ్ షుయ్ ప్రకారం లీకవుతున్న కొళాయిలను పట్టించుకోకపోతే, మీరు మీ ఇంటిపట్ల అశ్రద్ద వహించినట్టు. 

7. మిమ్మల్ని బాధపెట్టే వస్తువులుచాలా మంది చనిపోయిన తమ స్నేహితుల, బంధువుల ఫోటోలు, దుస్తులు, డైరీల్లాంటివి దాచుకుంటూ ఉంటారు. ఇంట్లో వేటిని చూస్తే మీ మనసు బాధతో నిండిపోతుందో అలాంటి వాటిని ఉంచుకోకూడదు. మనసు ఎంత తేలికగా, సంతోహంగా ఉంటుందో... మీ ఇంట్లో అంతగా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. డబ్బు నిలకడగా ఉంటుంది. 

Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు

Read Also: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు

Read Also:  నేడే రాజ్యాంగ దినోత్సవం... రాజ్యాంగ రూపకల్పనకు ఎంత ఖర్చయిందో తెలుసా?

Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి

Read Also: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి