ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమబాట పట్టడంపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చామని బుగ్గన గుర్తు చేశారు. గత ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పెట్టి.. ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని అయినప్పటికీ తాము సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నారు. ఇప్పటి వరకూ మధ్యంతర భృతిగా ఉద్యోగులకు  రూ. 15, 839 కోట్లు ఇచ్చామన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను కూడా దశలవారీగా ఇస్తామని స్పష్టం చేశారు. 








Also Read : ఉద్యమబాట పట్టిన ఉద్యోగ సంఘాలు... డిసెంబర్ 1 నుంచి ఉద్యమ కార్యాచరణ


ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు ఆదివారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాయి. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకూ వివిధ రకాల కార్యక్రమాలు చేపడారు. వచ్చే నెల ఆరో తేదీన ఒంగోలులో మహా ప్రదర్శన చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపుతుందని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు కారణంగానే ఉద్యోగులు ఉద్యమబాట పట్టారని వారు స్పష్టంచేశారు. 


Also Read : ఆ సినిమా చూసి శవం ముక్కలు చేసి.. వాటిని వేర్వేరు ప్రాంతాల్లో.. వ్యక్తి హత్య కేసులో సంచలన విషయాలు


ఉద్యోగుల ప్రధాన డిమాండ్ పీఆర్సీ ప్రకటన. అయితే ఆ పీఆర్సీ నివేదిక కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. పీఆర్సీ కాదు కదా.. ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వడం లేదని ఏపీ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఉద్యోగుల కోసం ఆత్మాభిమానం చంపుకుని అందరి దగ్గరకూ వెళ్లామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు దాచుకున్న రూ. 1600 కోట్లు ఎప్పుడిస్తారో  చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ సంఘాలకు విలువ లేకుండా చేస్తున్నారన్నాని నేతలు మండిపడుతున్నారు. 


Also Read : నెల్లూరులో అమరావతి రైతులకు సర్‌ప్రైజ్.. సంఘిభావం తెలిపిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !


ప్రభుత్వం కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత వెసులుబాటును బట్టి అడిగిన దాని కంటే ఎక్కువే ఇవ్వాలనుంటున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఆలస్యం అయినందున తక్షణం పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత అన్నీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. 


 


Also Read : నెల్లూరు జిల్లాకు చేరిన సోనూ సూద్ సాయం..


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి