న్యాయస్థానం టు దేవస్థావం మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు ఊహించని మద్దతు లభించింది. వర్షం కారణంగా సోమవారం కూడా పాదయాత్రకు విరామం ప్రకటించారు రైతులు. నెల్లూరులోని కొత్తూరు దగ్గర ఉన్న ఓ కల్యాణమండపంలో శిబిరంలో ఉన్నారు. వీరిని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. పాదయాత్రకు సంఘిభావం తెలిపారు. అనూహ్యంగా తమకు మద్దతు తెలియచేయడానికి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేను చూసి రైతులు ఆశ్చర్యపోయారు.


Also Read : ఉద్యమబాట పట్టిన ఉద్యోగ సంఘాలు... డిసెంబర్ 1 నుంచి ఉద్యమ కార్యాచరణ


కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి రైతులతో ఆప్యాయంగా మాట్లాడారు. పాదయాత్రలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తనను సంప్రదించమని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకూ అమరావతి రైతుల పాదయాత్రకు వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంఘిభావం తెలిపాయి. వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం మద్దతు తెలియచేయడం లేదు. పైగా బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్ మంత్రులు కూడా అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా సంబోధించి విమర్శలు గుప్పిస్తూంటారు.


Also Read: ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదని అఖిలపక్ష సమావేశంలో చెప్పాం: టీడీపీ ఎంపీలు


వైఎస్ఆర్‌సీపీ పార్టీ విధానం ప్రకారం.. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూంటారు. చివరికి రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి కూడా రైతులపై ఎప్పుడూ సానుభూతి చూపలేదు.  తొలి సారిగా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రైతులకు సంఘిభావం తెలియచేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హైకమాండ్ ఆదేశంతో వచ్చారా లేకపోతే వ్యక్తిగత ఆసక్తితతో వచ్చి రైతులకు సంఘిభావం తెలిపారా అన్నదానిపై స్పష్టత లేదు.


Also Read : అమరావతి మహా పాదయాత్రకు మరో రోజు విరామం


ప్రభుత్వం ఇటీవల మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది .  అయితే బిల్లులు ఉపసంహరించుకున్నాం కానీ.. తమ విధానం మాత్రం మూడు రాజధానులేనని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఆ పార్టీ విధానం మారలేదనుకోవాలి. అలాంటప్పుడు .. తమ ఎమ్మెల్యేను రైతుల కు సంఘిభావంగా పంపే అవకాశం లేదు. మరి కోటంరెడ్డి వ్యక్తిగత ఆసక్తితో వచ్చి ఉంటారని భావిస్తారు . అలా వచ్చినా వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఆగ్రహించకుండా ఉండదు. మరి కోటంరెడ్డి వ్యూహం ఏమిటో అనేది రాజకీయవర్గాలకు ఆసక్తికరంగా మారింది.


Also Read : నెల్లూరు జిల్లాకు చేరిన సోనూ సూద్ సాయం..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి