మేషం
ఈ రోజు మౌనంగా ఉండటం మీకు సానుకూల ఫలితాల్ని అందిస్తుంది. అందర్నీ గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఈ రోజు అదృష్టం మీకు 65 శాతం వరకు సానుకూలంగా ఉంటుంది.
​వృషభం
వృషభ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారులకు, విద్యార్థులకు కలిసొచ్చే సమయం. కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.  ఎవ్వరితోను వివాదాలు పెట్టుకోవద్దు. 
మిథునం
ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశాలున్నాయి. మీ తల్లి ఆరోగ్యం సక్రమంగా లేకుండా గత కొన్నాళ్లుగా ఇబ్బందులు పడుతుంటే ఈ రోజు కాస్త కోలుకున్నట్టు ఉంటారు.  మానసిక ఇబ్బందులు చాలావరకూ పరిష్కారమవుతాయి. కొన్ని అంశాలు ఇబ్బంది పెట్టినప్పటికీ మనోధైర్యంతో ముందుకుసాగండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఎవ్వరితోను వాదోపవాదాలు వద్దు. మృదు సంభాషణ మేలు చేస్తుంది.
కర్కాటకం
మీ ప్రవర్తనతో అందరి మన్ననలు పొందుతారు. స్నేహితులతో సంతోషసమయం గడుపుతారు.  కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం వేయడం మంచిది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. చేపట్టినపనులు సకాలంలో పూర్తిచేస్తారు. 
సింహం
సింహరాశివారికి తండ్రికి సంబంధించిన ఆస్తుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది.  అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. శుభవార్త వింటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.
కన్య 
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులకు కలిసొచ్చే సమయం.  మనసు ప్రశాంతంగా ఉంటుంది.  ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపిస్తారు. ఇబ్బందులు అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కలహాలకు దూరంగా ఉండండి. 
తుల
ఈ రోజు తులా రాశి వారికి కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. దైవబలం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురుపడవు. సమాజంలో గౌరవం అందుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. 
వృశ్చికం
వృశ్చిక రాశి  వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. తోడబుట్టిన వారినుంచి ప్రయోజనం పొందుతారు. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా ముందుకుసాగుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. 
ధనుస్సు 
ఈ రోజు ధనుస్సు రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి అవకాశాలొచ్చే సూచనలున్నాయి. తండ్రితో కొన్నిరోజులుగా ఉన్న విభేధాలు తొలగిపోతాయి. శుభవార్త వింటారు. ఆర్థికంగా కలిసొచ్చే సమయం. ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.
మకరం
ఈ రోజు మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. కొంత మంది ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బుధ్దిబలం పనిచేస్తుంది. పెద్దల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. 
కుంభం
ఈ రోజు కుంభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పాత వ్యాధులు తిరగబెట్టే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఉన్నప్పటికీ పక్కా ప్రణాళిక ప్రకారం ఫాలో అయితే అంతా మంచే జరుగుతుంది.  
మీనం
ఈ రోజు మీన రాశి వారు వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
Also Read: చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు... ఈ మూడు పేర్లు తెలుసా.. అందుకే కన్ఫూజనా..!
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
Also Read: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌