రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ మనదేశంలో నవంబర్ 30వ తేదీన లాంచ్ కానుంది. ఇందులో 6 నానోమీటర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇటువంటి ప్రాసెసర్‌తో రెడ్‌మీ ఫోన్ లాంచ్ అవ్వడం ఇదే మొదటిసారి.
లాంచ్‌కు ముంగిట ఈ ఫోన్ చార్జింగ్ కెపాసిటీని కూడా కంపెనీ టీజ్ చేసింది. 33W ప్రో ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. చైనాలో గత నెలలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11 5జీనే రీబ్రాండ్ చేసి రెడ్‌మీ నోట్ 11టీ 5జీగా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ధర(అంచనా)
ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.16,999గా ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఎంఐ.కాం, ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్పెసిఫికేషన్లు(అంచనా)
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. ఆక్వామెరైన్ బ్లూ, మాటే బ్లాక్, స్టార్‌డస్ట్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. 50 మెగాపిక్సెల్ కెమెరా ఇందులో ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
Also Read: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?
Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!