ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈరోజు 8 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.
కొన్ని రోజుల క్రితం శివశంకర్ మాస్టర్ కి కరోనా సోకడంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆసుపత్రి బిల్లులు ఎక్కువయ్యాయని.. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని శివశంకర్ మాస్టర్ కుటుంబసభ్యులు కోరారు. దీంతో సోనుసూద్, ధనుష్ లాంటి హీరోలు వెంటనే స్పందించారు. సోనూసూద్.. శివశంకర్ మాస్టర్ కొడుకుతో టచ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ధనుష్ ఏకంగా రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేశారని తెలుస్తోంది. రీసెంట్ గా చిరంజీవి సైతం స్పందించి వెంటనే.. రూ.3 లక్షల నగదు సాయం చేశారు. తెలుగు, తమిళం వంటి దక్షిణాది సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు. తెలుగులో రాజమౌళి, రామ్ చరణ్ 'మగధీర' సినిమాలోని 'ధీర ధీర' పాటకు శివశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ దక్కింది. 'బాహుబలి' చిత్రానికి కూడా శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. టెలివిజన్ రంగంలో 'ఆట జూనియర్స్', 'ఢీ' వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి యువ డాన్సర్లకు విలువైన సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన మృతి నృత్య కళా రంగానికి తీరని లోటు.
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి