శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. స్పెసిఫికేషన్లు మాత్రం తెలిపింది. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. చదరపు ఆకారంలో ఈ కెమెరాలను అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండనుంది.


ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ దీని ధర దేశాన్ని బట్టి మారుతుందని తెలిపింది. స్పెసిఫికేషన్లు బట్టి చూస్తే.. మనదేశంలో రూ.10 వేలలోపే దీని ధర ఉండే అవకాశం ఉంది. దీని సేల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియరాలేదు.


శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. ప్రాసెసర్ వివరాలను కంపెనీ ఇంకా తెలపలేదు. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండనున్నాయి.


ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. వీటిలో లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని మందం 0.91 సెంటీమీటర్లుగా ఉంది. డాల్బీ అట్మాస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను అందించారు. వాల్యూమ్ బటన్లను ఫోన్ ఎడమవైపు అందించారు. ఫ్లాట్ ఎడ్జ్‌డ్ డిస్‌ప్లేను ఇందులో అందించారు.


Also Read: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?


Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?


Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి