కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన బండ్ల గణేష్.. అప్పట్లో చాలా సినిమాలు చేశారు. ఆ తరువాత నిర్మాతగా మారి సినిమాలు తీయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసి స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. అయితే ఆ తరువాత తన జోరు తగ్గించారు. రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకున్నారు కానీ వర్కవుట్ అవ్వలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సినిమాల్లోకి నటుడిగా రీఎంట్రీ ఇచ్చారు. 

 

ప్రస్తుతం బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో 'డేగల బాబ్జీ' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో బండ్లకు మంచి హిట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బండ్ల గణేష్ సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. కరోనా సమయంలో సోషల్ మీడియా వేదికగా సాయం అడిగిన చాలా మందిని ఆదుకున్నారు బండ్ల గణేష్. తాజాగా ఆయన ఓ చిన్నారిది దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ తానొక నేపాలీ పాపను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకుంటూ వాటి కోసం చాలా ఖర్చు చేస్తుంటారని.. తాను మాత్రం ఈ పాటను పెంచుకొని, గొప్పగా చదివించాలనుకుంటున్నట్లు చెప్పారు. తన భార్య చెప్పడం వలనే ఈ పాపను దత్తత తీసుకున్నానని.. ఇప్పుడు తను మా ఇంట్లో మెంబర్ అయిపోయిందని.. ఇప్పుడు తామందరినీ బెదిరించే స్థాయికి వచ్చేసిందని నవ్వుతూ చెప్పారాయన.     






 


 


 


 


 


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి