'ఒక్కరో తప్పే చేస్తే సర్దుకోలేవా?
లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా?'
- 'గమనం' సినిమాలోని 'సాంగ్ ఆఫ్ లైఫ్'లో కృష్ణకాంత్ (కె.కె) రాసిన లైన్స్ ఇవి. ఈ విధంగా గతంలోనూ దేవుడికి ప్రశ్నలు సంధిస్తూ కొన్ని పాటలు వచ్చాయి. అవి శ్రోతలను ఆకట్టుకున్నాయి. విపత్తులు వచ్చినప్పుడు, సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తం అయినప్పుడు, మనిషి జీవితం ప్రశ్నార్థకం అయినప్పుడు... ఆ నేపథ్యాన్ని తీసుకుని కొందరు రచయితలు పాటలు రాశారు. అయితే... అదే భావం వచ్చేలా, ఆ పాటలను అనుసరించకుండా కొత్తగా రాసే ప్రయత్నం చేశారు కృష్ణకాంత్. ఇళయరాజా అందించిన ఖవ్వాలీ బాణీ, కైలాష్ కేర్ గాత్రం పాటను గతంలో వచ్చిన పాటలకు భిన్నంగా నిలబెట్టింది. అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ ద్వారా ఈ పాటను విడుదల చేశారు.
'ఎందుకని వదలవు గగనం
పాపమని కలుగద చలనం
వేదనని తరుమిదే తరుణం
రోదనకు జరుపిక దహనం' అంటూ ప్రజల రోదనకు ముగింపు పలకమని కోరడంతో పాటు... అదే సమయంలో ఎందుకు ఆకాశం నుంచి కిందకు రావడం లేదని, చలించడం లేదని దేవుడ్ని ప్రశ్నించారు కృష్ణకాంత్. 'ఆపవేరా? ఆదుకోరా?' అంటూ నిలదీశారు. 'అసలిది విన్నావో... వినపడి ఉన్నావో... వ్యధలు చెరుపు ఒక దైవం నీవే' అంటూ ఆ తర్వాత రాశారు.
శ్రియ, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'గమనం'. ఇదొక యాంథాలజీ ఫిల్మ్. 'మలుపులు ఎనెన్నో... అసలెటు వీళ్లేనో? కథలు కడకు ఎటు చేరేనో... ఏమో?' పాటలో సినిమాలోని కథల్లో పాత్రధారుల జీవితాన్ని సైతం ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. 'అందని ఆకాశాలే... కోరనే నేల! తీరని ఆశేనంటూ... ఒప్పుకోవేల' అంటూ అందని వాటి కోసం ప్రయత్నించడం ఎందుకు? వాస్తవాన్ని ఒప్పుకోరెందుకు? అంటూ పాత్రలనూ ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు కొందరి జీవితం ఏ విధంగా మారిందనే కథతో రూపొందిన చిత్రమిది. సుజనా రావును దర్శకురాలిగా పరిచయం చేస్తూ... రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 10న సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడు 'సాంగ్ ఆఫ్ లైఫ్' వచ్చింది. ఈ రెండూ చూస్తే... తెలుగులో డిఫరెంట్ సినిమా అయ్యేలా ఉందని ప్రేక్షకుల్లో కొందరు అంటున్నారు.
Song Of Life - Gamanam:
Also Read: ప్రభాస్ కొడితే 100మంది పడటం చూశాం! ప్రేమిస్తే ఎంత మంది పడతారో చూద్దాం!
Also Read: అనసూయ అడగాలే కానీ... లిప్ లాక్‌కు కూడా 'హైపర్' ఆది రెడీ!?
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
Also Read: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!
Also Read: టాలీవుడ్‌లో విషాదం... ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి