నట సింహం నందమూరి బాలకృష్ణకు కొన్ని రోజుల క్రితం కేర్ ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ఆయన చేతికి గాయం కావడంతో సర్జరీ చేసిన వైద్యులు, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే, గాయం ఎలా అయ్యిందనేది ఎవరికీ తెలియలేదు. శనివారం రాత్రి జరిగిన 'అఖండ' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆ గాయం కావడానికి చాలా వరకూ తానే కారణం అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.
"అభిమానులు, ప్రేక్షకులు అందరూ 'జై బాలయ్య' సాంగ్ చూశారు కదా! ఆ పాటకు బాలయ్య బాబు ప్రాక్టీస్ చేశారు. రెండు మూడు గంటలు ప్రాక్టీస్ చేసినప్పుడు చిన్నగా బాడీ పెయిన్స్ వస్తాయి. ఆర్టిస్ట్ ఎవరైనా సాయంత్రం స్ట్రెచింగ్ చేస్తే పెయిన్స్ రాకుండా ఉంటాయి. ఇంటికి వెళ్లి ఆయన స్ట్రెచింగ్ చేసే ప్రాసెస్ లో కాలు స్లిప్ అవ్వడంతో జారిపడి షోల్డర్ మీద ల్యాండ్ అయ్యారు. ఆయనకు గాయం అయింది. కోటిన్నర పెట్టి వేసిన సెట్ రెడీగా ఉంది. డాన్సర్లు రెడీగా ఉన్నారు. బాలయ్య బాబుకు గాయమైన సంగతి రాత్రి నాకు తెలిసింది. గుండె కిందకు జారింది. ఏం చేయాలో తెలియలేదు. రెండో రోజు ఉదయం బాలయ్య బాబు సెట్‌కు వచ్చారు. 'ఎలా ఉంది బాబు?' అని అడిగితే... 'కొంచెం నొప్పి ఉంది. కానీ, పర్వాలేదు' అన్నారు. 'అలా అంటే ఎలా? ఉంది ఒకే ఒక్క మాస్ సాంగ్. మనం చేస్తే... బాగా చేయాలి. లేదంటే ఆపేద్దాం' అన్నాను. అప్పటికి ఆయన చెయ్యి పైకి లేవడం లేదు. 'డైరెక్టర్ గారు... ఫ్యాన్స్ కోసం చేయాలి. మాస్ లేకపోతే ఎలా?. వాళ్లు ఉన్నది నా కోసం. జై బాలయ్య, జై బాలయ్య అంటుంటే... నేను అది కూడా చేయకపోతే ఎలా?' అని బాలయ్య బాబు అన్నారు. నా గుండె పగిలిపోయింది. షోల్డర్ డిస్ లొకేట్ అయిన సమయంలో కట్టు కట్టుకుని బాలయ్య బాబు చేసిన సాంగ్ 'జై బాలయ్య'. ప్రేక్షకులు చప్పట్లు కొట్టిన పాట అది. బాలయ్య బాబుకు అభిమానులు అంటే ఉన్న ఇది అది" అని బోయపాటి శ్రీను చెప్పారు.
Also Read: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్..
'అఖండ' లాంటి సినిమా తీయాలంటే ఒక సైన్స్ కావాలని, సినిమా చూశాక ప్రేక్షకులు ఆ విషయం చెబుతారని బోయపాటి శ్రీను వ్యాఖ్యానించారు. డిసెంబర్ 2న సినిమా విడుదల అవుతుందని, అందరూ వెళ్లి హ్యాపీగా సినిమా చూస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అభిమానులు, ప్రేక్షకులు హ్యాపీగా సినిమా చూసి, గుండెల మీద చెయ్యి వేసుకుని, కాలర్ ఎగరేసుకుని వచ్చే సినిమా 'అఖండ' అని బోయపాటి శ్రీను ధీమాగా చెప్పారు.
Also Read: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!
"అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా నేను ఎదగడానికి హెల్ప్ చేసిన వ్యక్తి బన్నీ బాబు. ఆ తర్వాత నేను కెరీర్ స్టార్ట్ చేసి... ఈ రోజు నేను ఇంత ఎత్తు ఎదగడానికి కారణం బాలయ్య బాబు. వాళ్లిద్దరూ ఒక స్టేజి మీద ఉండగా నేను మాట్లాడుతున్నాను. పైకి నేను ఇలా ఉన్నా... లోపల చాలా ఆనందంగా ఉంది" అని తన సంతోషాన్ని బోయపాటి శ్రీను వ్యక్తం చేశారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన 'అఖండ' డిసెంబర్ 2న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Also Read: టాలీవుడ్లో విషాదం... ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం
Also Read: యశ్‌కు క్షమాపణలు చెప్పిన అమీర్‌ఖాన్.. ‘కేజీఎఫ్ 2’కు ప్రచారం చేస్తానని వెల్లడి
Also Read: కావాలనే మమ్మల్ని పక్కన పెడుతున్నారా..? టికెట్ రేట్ ఇష్యూపై సురేష్ బాబు ఆవేదన..
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి