రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సినిమాకు సహకారం అందించాలని నందమూరి బాలకృష్ణ కోరారు. డిసెంబర్ 2వ తేదీన విడుదల కానున్న అఖండ ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ‘అఖండ మాత్రమే కాకుండా త్వరలో అల్లు అర్జున్ నటించిన పుష్ప, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, చిరంజీవి నటించిన ఆచార్య విడుదల కానున్నాయి. వీటితో పాటు చిన్నా, పెద్దా అన్ని సినిమాలు బాగా ఆడాలి. దీనికి రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల సహకారం కావాలి.’ అన్నారు.


దీంతోపాటు తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇచ్చారు. గోపిచంద్ మలినేనితో సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నట్లు స్టేజీ మీదనే ప్రకటించారు. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా ఎప్పట్నుంచో వార్తల్లో ఉంది. ఇప్పుడు అది అఫీషియల్ అనుకోవచ్చు.


‘ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆశీస్సులు. ఎస్ఎస్ రాజమౌళికి ధన్యవాదాలు. తల్లిదండ్రులను మనం దేవుళ్ల కంటే ఎక్కువగా పూజించాలి. అందుకే నేను మా తండ్రిని ఎప్పుడూ స్మరించుకుంటాను. నా తల్లిదండ్రుల తర్వాత అభిమానులను ప్రేమిస్తాను.’


‘నా అభిమానులు నా విజయాలకు పొంగిపోరు, పరాజయాలకు కుంగిపోరు. ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమైన మనిషి అల్లు రామలింగయ్య. ఇంతమంది అభిమానులను పొందడం మా పూర్వజన్మ సుకృతం. ఈ సినిమాలో నటీనటులందరూ ఎంతో బాగా నటించారు.’


‘నటన అంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం. నాకు శ్రీకాంత్, అల్లు అర్జున్ ఇద్దరు తమ్ముళ్లు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి అఖండ సినిమా చేశాం. అఖండ మొదలుపెట్టి సంవత్సరం పైన తొమ్మిది నెలలు అవుతుంది. అభిమానులందరూ క్షేమంగా ఇళ్లకు చేరండి. నా అభిమానులు అందరి అభిమానులకు ఆదర్శంగా ఉంటారు. త్వరలో గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడిలతో సినిమాలు చేయబోతున్నాను.’ అన్నారు.



Also Read:బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్‌



 


 


Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి



Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి