ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన్ను హైదరాబాద్‌లోని కిమ్స్‌ హస్పిటల్‌లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురి కావడంతో.. కిమ్స్‌కు చెందిన ప్రముఖ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లుగా సమాచారం. తాజాగా ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. న్యుమోనియాతోనే ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని.. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరని చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. 


విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు చేంబోలు సీతారామశాస్త్రి. పదోతరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన.. ఇంటర్ చదవడం కోసం కాకినాడ వెళ్లారు. ఆ తరువాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. తెలుగు భాషపై మంచి గ్రిప్ ఉండడంతో.. ఎంఏ చదువుతుండగానే ఆయనకు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు.

 

ఈ సినిమాతో గీతరచయితగా సీతారామ శాస్త్రికి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. ఇప్పటివరకు మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన.. పదినంది అవార్డులను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సాధించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. 'గాయం' సినిమాలో 'నిగ్గదీసి అడుగు' అనే పాట ఎవర్ గ్రీన్. 'క్రిమినల్' సినిమాలో 'తెలుసా మనసా', 'మహర్షి'లో 'సాహసం నా పథం' ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో ఉంటాయి. 

 

ఇక సోషల్ మీడియాలో ఆయన చివరిగా 'కొండపొలం' సినిమా నుంచి తలఎత్తు అనే సాంగ్ ని షేర్ చేస్తూ.. అందులో లిరిక్స్ ను అభిమానులతో పంచుకున్నారు. 

Also Read:బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్‌



 


 


Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి



Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి