అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి కోట్లాది రూపాయలు వసూలు చేసిన చీటింగ్ కేసులో యువ మహిళా నిర్మాత శిల్పా చౌదరిని శుక్రవారం హైదరాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ అధికారులు ప్రశ్నించారు. ఆమెపై గత వారం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశామని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

శిల్పా చౌదరి బంధువులలో ఒకరికి నగరంలో టాప్ స్కూల్ ఉందని పలువురిని నమ్మించి... అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అని చెప్పి, అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలను వసూలు చేశారు. ఇప్పటి వరకూ వడ్డీ కూడా ఇవ్వకపోవడంతో పాటు ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. గత వారమే కేసు నమోదు చేశారు. శుక్రవారం శిల్పా చౌదరిని పోలీస్ స్టేష‌న్‌కు పిలిచి విచారించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ యాక్టర్ సైతం తన భార్యతో కలిసి శిల్పా చౌదరిపై కేసు పెట్టినట్టి విశ్వసనీయ వర్గాల కథనం. పలు చీటింగ్ కేసులలో ఆమె పేరు వినిపిస్తున్నట్టు సమాచారం. ఆమె బాధితుల్లో సివిల్ సర్వెంట్స్ కూడా ఉన్నారట. ఓ కేసులో ఇతరుల నగలు తాకట్టు పెట్టి డబ్బులు తిరిగి ఇవ్వలేదట.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బంధువు అద్వయ జిష్ణు రెడ్డి నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా 'శెహరి'. దానికి శిల్పా చౌదరి కూడా ఓ నిర్మాత. ఆ సినిమాలో హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా నటించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఆ సినిమాలో సంగీత ద‌ర్శ‌కులు కోటి ఓ కీల‌క పాత్ర చేశారు. ఆల్రెడీ సిద్ శ్రీ‌రామ్ పాడిన ఓ పాట‌ను విడుద‌ల చేశారు. ఇంకా సినిమా విడుదల కాలేదు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read: త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు
Also Read: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!
Also Read: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు... వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని ఆర్డర్
Also Read: 456 మందితో రియల్ ‘స్క్విడ్ గేమ్’.. విజేతకు రూ.3.41 కోట్లు, ఓడినవాళ్లను ఏం చేశారంటే..
Also Read: ఒక్క రోజు ఆలస్యంగా 'మరక్కార్‌'... గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్!
Also Read: హీరోయిన్‌కు ఎదురైన సంఘటనల వల్లే 'అఖండ' ఎంట్రీ... బాలకృష్ణ సెట్‌లోకి నడిచి వస్తుంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి