కొన్ని రోజుల క్రితం భారత స్వాతంత్ర్యంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేశానికి 2014 లో స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్యానించింది. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలన్న గాంధీ ప్రవచనాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడింది. అలా చేసి తెచ్చుకున్నది స్వాతంత్ర్యం కాదు... భిక్షే అంటారని మళ్లీ మళ్ళీ అదే పదాన్ని వాడింది. అంతేకాదు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లకు అప్పట్లో గాంధీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై హైదరాబాద్ నాంపల్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దేశ స్వాతంత్ర్యంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలందరి మనోభావాలను దెబ్బతీశారని న్యాయవాది కరమ్ కొమిరెడ్డి నాంపల్లి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. కరమ్ ఫిర్యాదుపై విచారణ చేసిన నాంపల్లి కోర్టు ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది.
Also Read:'2021 నాకో రఫ్ ఇయర్..' సమంత వీడియోపై ఫ్యాన్స్ కామెంట్స్..
అవార్డులు వెనక్కి తీసుకోవాలని ధర్నాలు
భారతదేశానికి స్వాతంత్య్రంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశానికి స్వాతంత్ర్య్ం వచ్చిందని కామెంట్లు చేయడం విమర్శలకు దారితీసింది. కంగనాను తిట్టిపోస్తూ పలు సంఘాలు ధర్నాలు చేశాయి. కంగనాకు ఇచ్చిన అవార్డులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు చేశాయి. ఇంత జరిగినా కంగనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మళ్లీ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేసింది. తన ఇన్ స్టా ఖాతాలో ఒక సిరీస్ లా వివాదాస్పద పోస్టులు పెట్టింది.
Also Read: 'అనుభవించు రాజా' రివ్యూ: సోసోగా ఉంది రాజుగారూ!
ఇన్ స్టాలో వివాదాస్పద పోస్టులు
ఇలాంటి వివాదాస్పద పోస్టుల కారణంగా ట్విట్టర్ కంగనా ఖాతాను తాత్కాలికంగా నిలిపి వేసి, తిరిగి పునరుద్ధరించింది. ఇన్ స్టాలో దేశ స్వాతంత్య్రోద్యమాన్ని చులకన చేసి పోస్టులు పెట్టింది. నేతాజీని అప్పగించేందుకు గాంధీ అప్పట్లో అంగీకరించారని హెడింగ్ తో వచ్చిన వార్త క్లిప్పింగ్ ను ఆమె జత చేసింది. 'గాంధీజీ అభిమానిగా, నేతాజీ మద్దతుదారుగా ఉండలేరు. వారిద్దరిలో ఒకరినే ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ హీరోను తెలివిగా ఎంచుకోండి’ అంటూ ఓ పోస్టులో పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు కేసు నమోదుకు ఆదేశించింది.
Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి