టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో ఈ ఏడాది చాలా కష్టంగా సాగిందని అన్నారు. బాలీవుడ్, దక్షిణాదికి చెందిన పలువురు తారలతో ఇటీవల ఓ ఛానెల్ ఇంటరాక్షన్ సెషన్ ను నిర్వహించింది. సమంతతో పాటు తాప్సి, విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా, సాన్యా మల్హోత్రా, ఆదర్శ్ గౌరవ్ లు ఈ చిట్ చాట్ లో పాల్గొన్నారు. డిసెంబర్ 6న ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుల్ వీడియో బయటకు రానుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. 


ఈ వీడియోలో 2021 ఎలా గడిచిందో ఒక్క మాటలో చెప్పమని తారలను కోరారు. దీంతో ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇదే ప్రశ్నకు సమంత ఒక్క సెకన్ ఆగి.. 'రఫ్' అని ఆన్సర్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు సమంతకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. స్ట్రాంగ్ గా ఉండమంటూ సూచిస్తున్నారు. 


2021 సమంతకు నిజంగానే రఫ్ ఇయర్ అనే చెప్పాలి. తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడిపోతున్నట్లు చెప్పి షాకిచ్చారు సమంత. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడిపోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆమె మానసికంగా బాగా ఎఫెక్ట్ అయ్యారు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.. కెరీర్ పరంగా బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. 


ఇప్పటికే వరుస సినిమాలు ఒప్పుకున్నారు. శ్రీదేవి మూవీస్ లో ఓ సినిమా, ఒక బైలింగ్యువల్ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ సినిమాలో నటించడానికి అంగీకరించారు. 'అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌' అనే సినిమాలో నటిస్తున్నట్లు అఫీషియల్ గా వేలలాడించారు. వీటితో పాటు.. ఆమె నటించిన 'శాకుంతలం', 'కాతువక్కుల రెండు కాదల్‌' వంటి సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. 



Also Read: 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మ లాంటి పాట... 'జనని' వచ్చేసింది! చూశారా?