అమరావతి పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసుల్లో ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. పాలనా వికేంద్రీకణ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు కోర్టుకు తెలిపింది. సీఆర్‌డీఏ రద్దు చట్టాన్ని కూడా ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. శాసనసభ, మండలిలో ఉపసంహరణ బిల్లులు ఆమోదించినట్లు పేర్కొంది. ఈ రెండు బిల్లులను ఆమోదించినట్లు శాసనసభ కార్యదర్శి తెలిపారని ప్రభుత్వం అఫిడవిట్‌ లో తెలిపింది. 


Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !


చట్టబద్దతపై హైకోర్టులో విచారణ


మూడు రాజధానుల చట్టాలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం హైకోర్టుకు తెలియజేసింది. గత సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులపై ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు తెలిపింది.  పాలనా వికేంద్రీకరణ,  సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో రోజువారి విచారణ జరుగుతోంది. మూడు రాజధానుల బిల్లులు ఎప్పుడో పాసైపోయాయి. గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఆ సమయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు అవ్వడంతో ఆచరణ సాధ్యంకాలేదు. ఇప్పుడు వాటి చట్టబద్ధతపైనే విచారణ జరుపుతున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రెండు చట్టాలన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అనంతరం అసెంబ్లీలో సీఆర్డీఏ, పాలనా వికేంద్రీకరణ చట్టాలన్ని ఉపసంహరించుకునే బిల్లుల్ని ఆమోదించారు. 


Also Read: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం ! కొత్త వ్యూహం ఏమిటి ?


త్వరలో సమగ్ర బిల్లులు


మూడు రాజధానులపై వెనక్కి తగ్గడంలేదని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. త్వరలో మూడు రాజధానులపై సమగ్ర బిల్లులను అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెడతామని ప్రకటించారు.  పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో కొత్త బిల్లులు ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న సీఆర్డీఏను పునరుద్ధరిస్తున్నట్లు ఈ బిల్లులో స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును కూడా రద్దు చేస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు.  భాగస్వాములతో సంప్రదింపులు జరపకపోవడం, శాసనమండలిలో  బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లడం వంటి కారణాల వల్ల బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా బుగ్గన తెలిపారు. 


Also Read: సాగు చట్టాల విషయంలో కేంద్రంలాగే ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకుందా ? కొత్త మార్గంలో 3 రాజధానులు తెస్తారా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి