స్టాక్‌ మార్కెట్లు ఎరుపెక్కాయి..! నష్టాల బాటలో మదుపరి బక్కచిక్కిపోయాడు. కళ్లముందే లక్షల కోట్ల విలువ పతనం అవ్వడంతో విలవిల్లాడాడు. మొత్తంగా ఈ వారమంతా నష్టాల బాటలోనే పయనించాయి. సోమవారంతో పోలిస్తే శుక్రవారం నాటి పతనం మదుపర్లను భయపెట్టింది. బెంచ్‌మార్క్‌, సెక్టోరల్‌ సూచీలన్నీ మూడు శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 1687, నిఫ్టీ 509 పాయింట్ల మేర పతనం అయ్యాయి.



  • క్రితం రోజు 58,795 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం 58,795 వద్ద మొదలైంది. ఆరంభం కాగానే కరోనా కొత్త వేరియెంట్‌ భయం పట్టుకోవడంతో సూచీ ఒక్కసారిగా నేల చూపులు చూసింది. ఇంట్రాడే కనిష్ఠమైన 56,993ను తాకింది. చివరికి 1687 పాయింట్ల నష్టంతో 57,107 వద్ద ముగిసింది.

  • గురువారం 17,536 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఉదయం 17,338 వద్ద ఆరంభమైంది. 16,985 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 509 పాయింట్ల నష్టంతో 17,026 వద్ద ముగిసింది.

  • ఇక బ్యాంకు నిఫ్టీ మరింత ఒడుదొడుకులకు లోనైంది. 3.58 శాతం నష్టపోయింది. ఉదయం 36,830 వద్ద ఆరంభమైన సూచీ ఇంట్రాడేలో 35,904 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1,339 పాయింట్లు పతనమై 36,025 వద్ద ముగిసింది.

  • నిఫ్టీ 50 కంపెనీల్లో 46 నష్టపోగా 4 మాత్రమే లాభాల్లో ముగిశాయి. సిప్లా 7.23 శాతం పెరిగింది. డాక్టర్‌ రెడ్డీస్‌, దివిస్‌ ల్యాబ్‌, నెస్లేఇండియా లాభపడ్డాయి.  జేఎస్‌ డబ్ల్యూస్టీల్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో, అదానీ పోర్టులు, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఆరు నుంచి ఏడు శాతం వరకు నష్టపోయాయి.


Also Read: IPO Allotment Status: ఎంత ట్రై చేసినా ఐపీవో కేటాయించడం లేదా..? ఇలా చేస్తే బెటర్‌!!


Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్‌ కొనాలా? వద్దా? మార్కెట్లలో జోరైతే లేదు మరి!


Also Read: Vintage Cars: వింటేజ్ కార్లను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే?


Also Read: Latent View Analytics Ltd: 3 రోజుల్లో రూ.14,972కు రూ.38,304 లాభం..!


Also Read: Cryptocurrency Survey: క్రిప్టోను నియంత్రించొద్దు ప్లీజ్‌..! సర్వేలో 54% మంది స్పందన ఇది


Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి