మీకు వింటేజ్ కార్లంటే ఇష్టమా? వాటిని చూడాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. హిస్టారిక్ ఆక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వింటేజ్ కార్లను వేలం వేయనుంది. వేలానికి ముందు వాటిని ప్రజలు చూసేందుకు ఉండనున్నారు. వీటిలో 1934 నాటి కాడిలాక్ ఇంపీరియల్ సెడాన్, వింటేజ్ ఫియట్ టొపోలినో కూడా ఉండటం విశేషం.
ఈ వేలం ద్వారా కార్లను విక్రయించడం మాత్రమే కాకుండా వెహికిల్ మెయింటెయిన్స్ వంటి సర్వీసులను కూడా అందించనున్నారు. దీనికి సంబంధించిన ప్రైవేట్ ప్రివ్యూ గురుగ్రామ్‌లో ఇప్పటికే ప్రారంభం అయింది. నవంబర్ 26వ తేదీ వరకు పబ్లిక్ ప్రివ్యూ కూడా ఉండనుంది.
నవంబర్ 23వ తేదీన జరిగిన ప్రివ్యూకు మర్వార్ జోధ్‌పూర్ మహారాజు గజ్ సింగ్, సినిమా తార గుల్ పనాగ్ వంటి వంటి సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. వీరికి హానరరీ లైఫ్‌టైం మెంబర్‌షిప్ కూడా అందించనున్నారు. పాతకార్లు చూడాలని ఆసక్తి ఉంటే.. ఈ ప్రివ్యూని సందర్శించడవచ్చు.
ఇందులో అన్‌రీస్టోర్డ్ మహీంద్రా జీప్ సీజే-3బీ వంటి క్లాసిక్ కార్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారును గతంలో ఇండియన్ ఆర్మీ ఉపయోగించేది. మొత్తంగా తొమ్మిది వింటేజ్ కార్లు ప్రివ్యూలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 1934 కాడిలాక్ 355-డీ 7 పాసింజర్ ఇంపీరియల్ సెడాన్, 1924 ఆస్టిన్ 7, 1959 కాడిలాక్ సెడాన్ డీవిల్లే పాడిలాక్ పింక్ షేడ్, 1958 ఎంజీ ఏ-1500 స్పోర్ట్స్ కార్, 1958 టొయోటా ఎఫ్‌జే40 ల్యాండ్ క్రూజర్, ఫియట్ 500సీ టొపొలినో, సింగిల్ ఓన్డ్ 1982 మెర్సిడెస్ బెంజ్ 200, 1958 మెర్సిడెస్ బెంజ్ 180 పొంటోన్, 1974 క్రిస్లర్ విండ్సర్ వంటి కార్లు కూడా ఉన్నాయి.
వచ్చే నెలలో జరగనున్న ఈ వేలం యువత టార్గెట్‌గా జరుగుతోంది. ఈ వేలం ద్వారా వచ్చిన నగదు ఆర్మీ వెటరన్ వెల్పేర్ గ్రూపుకు వెళ్లనున్నాయని హిస్టారిక్ ఆక్షన్ తెలిపింది.
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!