క్రిప్టో కరెన్సీ విపణిలో కొనుగోళ్లు మందగించాయి. వీటిని కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం అంటుండగా మరికొందరేమో అస్సలు పెట్టుబడులు పెట్టొద్దని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఎక్కువ మార్కెట్‌ విలువ కలిగిన బిట్‌కాయిన్‌, ఎథిరెమ్‌ అటు ఇటుగా ఉన్నాయి. 24 గంటల్లో క్రిప్టో 1.50 శాతం పెరిగి రూ.44,57,368 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక ఎథిరెమ్‌ 0.10 శాతం తగ్గి 3,32,010 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


టెథెర్‌ 0.07 శాతం పెరిగి రూ.77.62, యూఎస్‌డీ కాయిన్‌ 0.08 శాతం తగ్గి 77.57, రిపుల్‌ 1 శాతం తగ్గి రూ.79.96, కర్డానో 4.19 శాతం తగ్గి రూ.127, బైనాన్స్‌ 4.55 శాతం పెరిగి రూ.47,506 వద్ద కొనసాగుతున్నాయి. ఇక డోజీ కాయిన్‌ 2.26 శాతం తగ్గి రూ.16.80, సొలానా 6.05 శాతం తగ్గి రూ.15,869 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.


హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.


క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.


భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.


Also Read: Cryptocurrency Bill 2021: బిగ్‌ బ్రేకింగ్‌..! దేశంలో అన్ని క్రిప్టో కరెన్సీలపై నిషేధం..? పార్లమెంటులో బిల్లు


Also Read: Cryptocurrency Crash: పడిపోయిన క్రిప్టో ధరలు.. దాదాపు అన్ని కాయిన్స్ నేల చూపులు, ఆ ప్రకటనతో అందరిలో ఆందోళన


Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !


Also Read: Audi Q5: ఆడీ క్యూ5 కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


Also Read: Gold-Silver Price: శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. భారీగా పతనమైన వెండి, తాజా ధరలు ఇలా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి