ఆడీ మనదేశంలో కొత్త లగ్జరీ ఎస్‌యూవీ కారును లాంచ్ చేసింది. అదే ఆడీ క్యూ5. దీని ధర మనదేశంలో రూ.58.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఆడీ క్యూ5 మనదేశంలో చాలా ముఖ్యమైన ఎస్‌యూవీ కారు. గతంలో ఎస్‌యూవీ సేల్స్ జరిగినప్పుడు ఎన్నో ఆడీ కార్లు మనదేశంలో అమ్ముడుపోయాయి. ఈ కొత్త క్యూ5లో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్లు మారడంతో పాటు పెట్రోల్ ఇంజిన్ కూడా ఇందులో అందించారు.


ఇందులో 2.0 లీటర్, 4-సిలిండర్, టీఎఫ్ఎస్ఐ టర్బో పెట్రోల్ మోటార్ కూడా ఇందులో ఉంది. 249 హెచ్‌పీ, 370 ఎన్ఎం టార్క్‌ను ఇది అందించనుంది. ఇందులో 7-స్పీడ్, ఎస్-ట్రానిక్, డ్యూయల్ క్లచ్ గేర్ బాక్స్ కూడా ఉండనుంది. ఇందులో సస్పెన్షన్‌తో పాటు నాలుగు చక్రాలకు డ్యాంపింగ్ కంట్రోల్ కూడా ఉంది.


దీని డిజైన్‌లో కూడా ఎన్నో మార్పులు చేశారు. లార్జ్ సింగిల్ ఫ్రేమ్ గ్రిల్, వెహికిల్ స్ట్రట్స్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్లు, కొత్త 19 అంగుళాల చక్రాలు కూడా ఇందులో అందించారు. గతంలో వచ్చిన మోడల్‌ను మించిన స్పోర్ట్స్ లుక్ ఇందులో అందించారు. ఇందులో 10.1 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్ అందించారు. ఆడీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం కూడా ఇందులో ఉంది.


వర్చువల్ కాక్‌పిట్, బీఅండ్ఓ ప్రీమియం 3డీ సౌండ్ సిస్టం, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ మెమొరీ, 3 జోన్ క్లైమెట్ కంట్రోల్, ఆడీ పార్క్ అసిస్ట్, కంఫర్ట్ కీ, బూట్ లిడ్ ఆపరేషన్, వైర్‌లెస్ చార్జింగ్, 8 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇందులో ఉన్నాయి.


ఇందులో ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లు ఇందులో ఉన్నాయి. వీటికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. రూ.2 లక్షలతో దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త క్యూ5 కారు ఆడీ సేల్స్ మరింత పెరగవచ్చు. మిడ్‌సైజ్ లగ్జరీ ఎస్‌యూవీల్లో ఇది ఎంతో పాపులర్ కాబట్టి ఈ కారు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. క్యూ5తో పాటు క్యూ7 కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి