తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఉదారత చాటుకున్నారు. టీఎస్ఆర్టీసీ సంస్థ నుంచి గౌరవ వేతనాన్ని తీసుకోనని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. శాసనసభ సభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలని ఆర్టీసీ ఛైర్మన్ తెలిపారన్నారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున సంస్థపై ఆర్థికభారం మోపడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాజిరెడ్డి తెలియజేశారు. ఛైర్మన్ బాజిరెడ్డి నిర్ణయం పట్ల సంస్థ ఎండీ వి.సి. సజ్జనార్, అధికారులు, సూపర్‌వైజర్లు ఉద్యోగులు హర్షం తెలిపారు. తీవ్రనష్టాల్లో ఉన్న ఆర్టీసీపై మరింత ఆర్థిక భారం మోపడం ఇష్టంలేదని అందుకే సంస్థ తనకు ఇచ్చే గౌరవ వేతనాన్ని వద్దని చెప్పారు బాజిరెడ్డి. ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు చాలని ఆయన స్పష్టం చేశారు.
Also Read: ఖమ్మంలో వామపక్షాలతో టీఆర్ఎస్ దోస్తీ.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు ప్లాన్ !
ఆర్టీసీ అభివృద్ధికి కృషి
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్థన్‌కు సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్ 20న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్టీసీ అభివృద్ధికి సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Also Read: కలెక్టర్ వాహనంపై 28 చలానాలు... వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు..
ఆర్టీసీ ఆర్థిక బలోపేతానికి ప్రయత్నాలు
ఇటీవల ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై జోరుగా చర్చ నడిసింది. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా పెంచే ఆలోచన ఉందని అప్పట్లో ఎండీ సజ్జనార్ చెప్పారు. ఛార్జీల పెంపు విషయంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీలో 49 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, వారందరికీ ప్రతినెల 1వ తేదీనే జీతాలు అందిస్తున్నామని సజ్జనార్ చెప్పారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు బస్టాండ్ లో యూపీఐ పేమెంట్లకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. శుభకార్యాలకు, విహార యాత్రలకు, వన భోజనాలకు, రైతుల ధాన్యం తరలించేందుకు ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించింది. అడ్వాన్స్ చెల్లించాల్సిన అవసరం కూడా ఈ సేవలు అందిస్తుంది.
Also Read: జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి... కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్... 32 మందిపై కేసులు
Also Read: తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !
Also Read: ఫకీర్ మాటలు బంద్ చేయండి.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో అలా అవమానం: మంత్రి ఎర్రబెల్లి