లేటెంట్ వ్యూ అనలిటిక్స్ కంపెనీ ఐపీవో సూపర్ హిట్టైంది. ఇన్వెస్టర్లకు డబ్బుల పంట పండించింది! కేవలం రెండు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడికి ఇబ్బడి ముబ్బడిగా రాబడిని ఇచ్చింది. గురువారం ఈ కంపెనీ షేరు ధర రూ.701.90 ముగియడం గమనార్హం. మరి ఒక లాట్ కొనుగోలు చేసిన వారికి ఎంత లాభం వచ్చిందో ఓసారి చూద్దామా!!
డేటా అనలిటిక్స్‌కు చెందిన ఈ కంపెనీ ఐపీవోకు విపరీతమైన స్పందన లభించింది. 326 రెట్లు స్పందన లభించింది. దాంతో కొద్దిమంది అదృష్టవంతులకే కేటాయింపు లభించింది. రిటైల్ ఇండివిజ్యువల్ ఇన్వెస్టర్ల విభాగంలో 120 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 850 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs)లో 145.48 రెట్లు స్పందన లభించింది.
మంగళవారం లేటెంట్ కంపెనీ మార్కెట్లో లిస్టైంది. ఇష్యూ ధరను షేరుకు రూ.197గా ప్రకటించారు. ఒక్కో లాట్‌కు 76 షేర్లు ఇచ్చారు. అంటే ఒక లాట్ కొనుగోలు చేసిన వారు రూ.14,972 పెట్టుబడి పెట్టారు. విపరీతమైన డిమాండ్ లభించడంతో ఇష్యూ ధరతో పోలిస్తే 169 శాతం ప్రీమియంతో నమోదైంది. బీఎస్‌ఈలో రూ.530, ఎన్‌ఎస్‌ఈలో రూ.512 వద్ద నమోదైంది. అంటే ఒక్కో షేరుకు రూ.333 లాభం వచ్చింది. తొలిరోజు రూ.585 వద్ద ముగిసిన ఈ షేరు గురువారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సరికి రూ.701 వద్ద స్థిరపడింది. ప్రతి రోజూ అప్పర్ లిమిట్‌లోనే ధర ఉంటోంది.
ఈ షేరు లిస్టై గురువారానికి మూడు రోజులు. ఒక లాట్ కొనుగోలు చేసిన వారీ అద్భుతమైన రాబడి వచ్చింది. రూ.14,972 పెట్టుబడి పెట్టగా మూడు రోజుల్లోనే దాని విలువ రూ.53,276కు చేరుకుంది. అంటే రూ.38,304 లాభం వచ్చింది.
Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !
Also Read: Audi Q5: ఆడీ క్యూ5 కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Also Read: Gold-Silver Price: శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. భారీగా పతనమైన వెండి, తాజా ధరలు ఇలా..