దేశంలో క్రిప్టో కరెన్సీని నియంత్రించొద్దని, చట్టబద్ధత పరిధిలోకి తీసుకురావద్దని ఎక్కువ మంది భారతీయులు కోరుకుంటున్నారట! లోకల్‌ సర్కిల్‌ నిర్వహించిన ఓ సర్వేలో 54 శాతం మంది వద్దనే అంటున్నారట. అయితే విదేశాల్లోని డిజిటల్‌ అసెట్స్‌పై పన్నులు వేసినా ఫర్వాలేదని కోరుతున్నారు.


గత 15 రోజులుగా 56,000 మందితో ఈ సర్వే నిర్వహించారు. అందులో 26 శాతం మంది మాత్రమే క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ అవసరమని, పన్నులు వేయాలని కోరుతున్నారు. మిగతా 20 శాతం మందికి ఎలాంటి అభిప్రాయం లేదని తెలిపారు.


'చట్టబద్ధత, నియంత్రణ, భద్రత లేనప్పటికీ చాలామంది భారతీయులు క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టారు. ఎక్కువ నష్టభయంతో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. సర్వేల్లో పాల్గొన్న వారిలో 76 శాతం మంది క్రిప్టోపై తమకు నమ్మకం లేదని చెబుతున్నారు' అని లోకల్‌ సర్కిల్స్‌ సీఈవో సచిన్‌ తపారియా అంటున్నారు.


క్రిప్టో కరెన్సీలు, వేదికలు, ఎక్స్‌ఛేంజ్‌లు క్రిప్టోపై ఇస్తున్న ప్రకటనల్లో పెట్టుబడులపై ఉన్న నష్టాలు, నష్టభయాన్ని ప్రాధాన్యం ఇచ్చి చెప్పడం లేదని తపారియా పేర్కొన్నారు. నియంత్రణ, నిబంధనలు వచ్చేంత వరకు ప్రకటనలను ఆపాలని 76 శాతం మంది సర్వేలో చెప్పారని తెలిపారు.


ప్రైవేటు క్రిప్టో కరెన్సీని నిషేధించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. సొంత డిజిటల్‌ కరెన్సీని రూపొందించనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును శీతకాల సమావేశాల్లో పార్లమెంటులో పెట్టనున్నారని తెలిసింది. దాంతో వర్చువల్‌ కరెన్సీల విలువ హఠాత్తుగా పడిపోయింది. ఇన్వెస్టర్లు ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారు.  చాలామంది కాయిన్లను విక్రయిస్తున్నారు.


Also Read: Cryptocurrency Bill 2021: బిగ్‌ బ్రేకింగ్‌..! దేశంలో అన్ని క్రిప్టో కరెన్సీలపై నిషేధం..? పార్లమెంటులో బిల్లు


Also Read: Cryptocurrency Crash: పడిపోయిన క్రిప్టో ధరలు.. దాదాపు అన్ని కాయిన్స్ నేల చూపులు, ఆ ప్రకటనతో అందరిలో ఆందోళన


Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !


Also Read: Audi Q5: ఆడీ క్యూ5 కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


Also Read: Gold-Silver Price: శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. భారీగా పతనమైన వెండి, తాజా ధరలు ఇలా..


Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్‌ కొనాలా? వద్దా? మార్కెట్లలో జోరైతే లేదు మరి!


Also Read: Vintage Cars: వింటేజ్ కార్లను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే?


Also Read: Cryptocurrency Crash: పడిపోయిన క్రిప్టో ధరలు.. దాదాపు అన్ని కాయిన్స్ నేల చూపులు, ఆ ప్రకటనతో అందరిలో ఆందోళన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి